breaking news
hrudaya foundation
-
పవర్ స్టార్....... హార్ట్ వాక్
-
పవన్ కళ్యాణ్... హార్ట్వాక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం నగరంలోని నెక్లస్ రోడ్డులో సందడి చేశారు. హృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే హార్ట్ వాక్‌ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్‌లతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన 5కే హార్ట్ వాక్‌లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో యువతి, యువకులు నెక్లస్ రోడ్డుకి తరలివచ్చారు. చిన్నారుల్లో పెరుగుతున్న గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకే ఈ హార్ట్వాక్ను ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.