breaking news
housing pd
-
కర్నూలు ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్
- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం కర్నూలు సీక్యాంప్: కర్నూలు ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు ఆర్డీఓ పోస్ట్ కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్–3 డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునను ప్రభుత్వం నియమించింది. అయితే కొందరు అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో బాధ్యతలు స్వీకరించలేదు. ఈ క్రమంలో హౌసింగ్ పీడీగా పనిచేస్తున్న హుసేన్‌సాహెబ్‌ను ఇన్చార్జ్ ఆర్డీఓగా అప్పటి కలెక్టర్ సీహెచ్. విజయ్‌మోహన్ నియమించారు. రెండు కీలకకైన పోస్టులపై దృష్టి సారించడం సమస్య కావడంతో పూర్తి స్థాయి ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన జిల్లాలో డోన్, కృష్ణగిరి, కర్నూలు, తదితర మండలాల తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది అనంతపురం జిల్లాలో పనిచేశారు. -
నెలాఖరుకు పక్కాఇళ్ల నిర్మాణం మొదలు కావాలి
హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి రామాపురం(తడ): మండలానికి మంజూరైన పక్కా ఇళ్లకు సంబంధించి ఈ నెలాఖరుకల్లా బేస్మెంట్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి స్థానిక అధికారులకు సూచించారు. రామాపురం ఎస్సీ కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన లేఔట్లో 42 ఇళ్లు మంజూరైనప్పటికీ ఇంతవరకు ఎవరూ ముందుకు రాకపోవడంపై పీడీ అధికారులను కారణాలు అడిగారు. మండలంలో 167 ఇళ్లు మంజూరు అయినప్పటికీ కేవలం 18 మంది లబ్ధిదారులు మాత్రమే పనులు ప్రారంభించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత రూ.2.5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం రూ.1.5 లక్షలు ఇస్తామనడంతో లబ్ధిదారులు ఆలోచనలో పడ్డారని అధికారులు తెలిపారు. ఆయన వెంట ఈఈ సాయిరాంనాయుడు, డీఈ నటరాజ్, ఏఈ మురళి ఉన్నారు.