breaking news
Housing loan interest
-
గృహ రుణాలకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: గృహ రుణాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో బ్యాంకుల పుస్తకాల్లో గృహ రుణాలు రెట్టింపై రూ.16.85 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనూ (ఏప్రిల్–ఆగస్ట్ వరకు) గృహ రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఆర్బీఐ 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. సెప్టెంబర్‌లోనూ అర శాతం మేర పెంచడం గమనార్హం. 2016–17 నాటికి బ్యాంకుల నుంచి గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.8,60,086 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ.16,84,424 కోట్లకు వృద్ది చెందింది. రేట్ల పెంపు ప్రభావం ఉండదు.. వడ్డీ రేట్ల అన్నవి ముఖ్యమైనవే అయినప్పటికీ.. అవి గృహ కొనుగోలుకు అవరోధం కాదని, రుణ గ్రహీతల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు ఆదాయ అంచనాలపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గృహ రుణ కాలంలో (15–20 ఏళ్లు) వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం అన్నది సాధారణ ప్రక్రియగా ఇన్వెస్టర్లలోనూ అవగాహన పెరుగుతుండడాన్ని ప్రస్తావించాయి. రుణాలపై ఇళ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంటి ధర కీలకం అవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ట్గేజ్, రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి పేర్కొన్నారు. ‘‘గృహ రుణం అన్నది దీర్ఘకాలంతో ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని కస్టమర్లకూ తెలుసు. దేశంలో సగటు వేతన పెంపులు 8–12 శాతం మధ్య ఉంటున్నందున పెరిగే రేట్ల ప్రభావాన్ని వారు తట్టుకోగలరు’’అని సోలంకి అభిప్రాయపడ్డారు. ప్రణాళిక మేరకే.. వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల డిమాండ్‌పై పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ రేణు సూద్ కర్నాడ్ సైతం పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు అన్నది మిగిలిన ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య చర్చించిన తర్వాతే, ప్రణాళిక మేరకు ఉంటుందన్నారు. కారు, కన్జ్యూమర్ రుణాల మాదిరిగా కాకుండా, 12–15 ఏళ్లు, అంతకుమించి కాల వ్యవధితో ఉండే గృహ రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. ‘‘కనుక వడ్డీ రేట్ల పెంపు వారి నగదు ప్రవాహాలపై తక్కువ ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా 12–15 ఏళ్ల కాలంలో రెండు మూడు విడతల్లో రేట్ల పెంపు ఉండొచ్చు. దీర్ఘకాలంలో రేట్లు దిగొస్తాయని వినియోగదారులకు సైతం తెలుసు’’అని కర్నాడ్ పేర్కొన్నారు. ఇళ్లకు డిమాండ్ చక్కగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ‘‘ఇళ్ల విక్రయాలు బలంగా కొనసాగుతున్నాయి. 2022 చివరికి దశాబ్ద గరిష్టానికి చేరుకుంటాయి. స్థిరమైన ధరలకుతోడు, పండుగల డిమాండ్, గృహ రుణాలపై తక్కువ రేట్లు (గతంలోని 10–11 శాతంతో పోలిస్తే) సానుకూలతలు’’అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ వివరించారు. కాకపోతే అదే పనిగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే ఈఎంఐ పెరిగి, సెంటిమెంట్‌కు విఘాతం కలగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87 శాతం పెరిగి.. 2,72,709 యూనిట్లు అమ్ముడైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. -
హౌసింగ్ లోన్, పోటీ పడి మరీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో నెలకొనే గృహ రుణ డిమాండ్‌లో మెజారిటీ వాటా పొందడానికి పోటీ పడుతున్న బ్యాంకుల్లో తాజాగా ప్రైవేటు రంగంలోని హెచ్ఎస్బీసీ, యస్ బ్యాంక్ లు చేరాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... వడ్డీ భారం ఎక్కువై ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణం మార్చుకునే వారికి (బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్) సంబంధించి వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.45 శాతంగా అమలు చేస్తున్నట్లు హెచ్ఎస్బీసీ ప్రకటించింది. బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఇది అతి తక్కువ గృహ రుణ వడ్డీరేటు. ► ఇక కొత్త రుణాల విషయంలో బ్యాంక్ 6.70 శాతం వడ్డీ ఆఫర్ ఇస్తోంది. ఇది ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు సమానం. ► డిసెంబర్ 31 వరకూ అమలవుతుందని, తాజా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండబోదని హెచ్ఎస్బీసీ పేర్కొంది. ► యస్ బ్యాంక్ కూడా 6.70 శాతానికి గృహ రుణాన్ని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. వేతనం పొందే మహిళలకు సంబంధించి ఈ ఆఫర్ 6.65 శాతంగా ఉంటుంది. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... పండుగ సీజన్ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుందని ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. ఇక మరో ప్రభుత్వ రంగ బీఓబీ కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుందని ప్రకటించింది. ప్రభుత్వ రంగ పీఎన్బీ కూడా రూ.50 లక్షలు దాటిన గృహ రుణంపై అరశాతం (50 బేసిస్ పాయింట్లు) వడ్డీరేటు తగ్గించింది. దీనితో ఈ రేటు 6.60 శాతానికి దిగివచ్చింది. హెడ్‌డీఎఫ్‌సీ రుణ రేటును 6.7 శాతానికి తగ్గించింది. చదవండి: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది -
2014లో రియల్టీ పయనమెటు?
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగం 2014లో విప్లవాత్మక మార్పులకు కేంద్రబిందువు కానుంది. స్థిరాస్తి మోసాలకు ముకుతాడు వేసే స్థిరాస్తి నియంత్రణ బిల్లు, భూ సేకరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర లభిస్తే స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయా బిల్లులతో భూముల విలువ గణనీయంగా పెరిగి బిల్డర్లు, డెవలపర్లు ఫ్లాట్లు, ప్లాట్ల రేట్లను పెంచే ప్రమాదం కూడా ఉంది. అందుకే బిల్డర్లు, కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని ధరలు పెరగకుండా స్థిరాస్తి నియంత్రణ బిల్లులో కొన్ని మార్పులు తీసుకురావాలి. సంస్కరణలు ఆరంభంకావడంతో గృహరుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతాయని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా కొనుగోలుదారులు ఎప్పుడెప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయా అని వేచిచూస్తున్నారని, ఇది నిజమైతే కొనుగోలుదారులు ఇళ్లను కొనడానికి ముందుకొస్తారు.