breaking news
homemade Facial
-
పండుగ వేళ కొత్త రుచులు కావాలా? ఈ వంటకాలు ట్రై చేయండి..
పండుగైనా.. ప్రత్యేకమైన రోజైనా.. ఇంట్లోకి వచ్చే అతిథులకు వెరైటీ వంటకాలు వడ్డించాలంటే ఈ రెసిపీలు మీకు బాగా ఉపయోగపడతాయి. రుచితో పాటు చూడటానికి కూడా ఆకట్టుకునేలా ఉండే ఈ మూడు వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నవరతన్ కుర్మా, క్రిస్పీ పొటాటో క్యూబ్స్, కాజూ కలశ్ ఎలా తయారు చేయాలో చూద్దాం.నవరతన్ కుర్మాకావలసినవి..తొమ్మిది రకాల కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, బఠాణీ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్, పనీర్, జీడిపప్పు, బాదం, కిస్మిస్): 2 కప్పులు, ఉల్లిపాయలు: 2 (తరిగినవి),టొమాటోలు: 2 (తరిగినవి),అల్లం వెల్లుల్లి పేస్ట్: టీస్పూన్,గసగసాలు– జీడిపప్పు పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు,ఫ్రెష్ క్రీమ్: 2 టేబుల్ స్పూన్లు,గరం మసాలా: 1/2 టీస్పూన్,కసూరీ మేథీ: 1/2 టీస్పూన్,కారం, పసుపు: రుచికి తగినంత,నెయ్యి లేదా నూనె: 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు: తగినంత.తయారీ..ముందుగా క్యారట్, బీన్స్, బఠాణీ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసి 50 శాతం వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పనీర్ ముక్కలు, జీడిపప్పు, బాదం, కిస్మిస్లను నెయ్యిలో దోరగా వేయించాలి.తరువాత మసాలా పేస్ట్ తయారీ కోసం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, టొమాటోలను మెత్తగా రుబ్బుకోవాలి.విడిగా నానబెట్టిన గసగసాలు, జీడిపప్పును కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ–టొమాటో పేస్ట్ వేసి నూనె తేలే వరకు వేయించాలి.అందులో పసుపు, కారం, ఉప్పు, గసగసాలు–జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి.ఇందులోనే ఉడికించిన కూరగాయలు, వేయించిన పనీర్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి బాగా కలపాలి.తగినన్ని నీళ్లు లేదా పాలు పోసి మూతపెట్టి 5–7 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.చివరగా గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, కసూరీ మేథీ చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ నవరతన్ కుర్మా నాన్ లేదా జీరా రైస్‌లోకి చాలా రుచిగా ఉంటుంది.క్రిస్పీ పొటాటో క్యూబ్స్కావలసినవి..బంగాళాదుంపలు: 3 పెద్దవి (చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి),వంట సోడా: 1/2 టీస్పూన్,నూనె: 3 టేబుల్ స్పూన్లు,కార్న్‌ఫ్లోర్: 1 టేబుల్ స్పూన్,వెల్లుల్లి పొడి: 1 టీస్పూన్,కారం: 1 టీస్పూన్,మిరియాల పొడి: 1/2 టీస్పూన్,ఉప్పు: తగినంత.తయారీ..ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఉప్పు, బేకింగ్ సోడా వేసి మరిగించాలి.అందులో బంగాళ దుంపల ముక్కలు వేసి, ఐదు నిమిషాలు సగం ఉడికేలా మరిగించి నీటిని వడకట్టాలి.ఆ తరువాత నీళ్లు తీసేసిన పొటాటో ముక్కలను అదే పాత్రలో ఉంచి, బాగా కుదపాలి.ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని నూనె, కార్న్‌ఫ్లోర్, వెల్లుల్లి పొడి, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి.పాన్ లో నూనె వేసి వేడయ్యాక, ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ మీద 12–15 నిమిషాల పాటు తిప్పుతూ బంగారం రంగు వచ్చే వరకు వేయించాలి.అంతే వేడి వేడి క్రిస్పీ పొటాటో క్యూబ్స్ రెడీ. వీటిని వేడిగా ఉన్నప్పుడే సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.కాజూ కలశ్కావలసినవి..జీడిపప్పు: కప్పు,పంచదార: 1/2 కప్పు,నీళ్లు: 1/4 కప్పు,ఏలకుల పొడి: 1/4 టీస్పూన్,నెయ్యి: టీస్పూన్,స్టఫింగ్ కోసం (సన్నగా తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు): 3 టేబుల్ స్పూన్లు,కుంకుమపువ్వు / గ్రీన్ ఫుడ్ కలర్: కొద్దిగాతయారీ..జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి.పాన్‌లో పంచదార, నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి.పాకంలో తయారుచేసి పెట్టుకున్న జీడిపప్పు పొడి వేసి తక్కువ మంటపై కలుపుతూ ఉండాలి.మిశ్రమం దగ్గరపడ్డాక, టీస్పూన్ నెయ్యి, ఏలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని చపాతీ పిండిలా మెత్తగా ఒత్తుకోవాలి.ఇపుడు పిండిని కలశం ఆకారంలో తయారు చేసుకునేందుకు, పిండి నుంచి ఒక చిన్న ఉండను తీసుకుని బొటనవేలితో మధ్యలో నొక్కుతూ చిన్న కలశం ఆకారంలో చేసుకోవాలి.లోపలి భాగంలో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేయాలి.పైన పిస్తా లేదా కుంకుమపువ్వు నీళ్లతో చిన్న బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. అంతే రుచికరమైన, అందమైన కాజు కలశ్ రెడీ!ఇవి కూడా చదవండి: చిన్నవే.. కానీ ఇంటి పనుల్లో ఫుల్ హెల్ప్! -
హోంమేడ్ ఫేషియల్
న్యూ ఫేస్ ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఇకపై ఫేషియల్ చేసుకోవచ్చు. దాంతో ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు... అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకొని ఆకర్షణీయంగా తయారై వెళ్లొచ్చు. దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం.. క్లెంజింగ్: ఫేషియల్‌లో మొదటి స్టెప్ క్లెంజింగ్. అంటే క్లీనింగ్. ముందుగా ముఖానికి కాస్తంత కొబ్బరి నూనె రాసుకొని అరనిమిషం పాటు మర్దనా చేసుకోవాలి. తర్వాత వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌ను ముఖంపై పెట్టుకొని, రెండు నిమిషాల తర్వాత పొడి క్లాత్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. స్టీమింగ్: ముందుగా వేడి నీళ్లలో నిమ్మగడ్డి లేదా లావెండర్ ఆయిల్‌ను వేయాలి. ఆ నీటి ఆవిరి తగిలేలా, ముఖాన్ని గిన్నెకు కాస్తంత దగ్గరగా పెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా తల మీద ఏదైనా టవల్ కప్పుకోవాలి. అలా అయిదు నిమిషాలు ఉన్న తర్వాత ముఖాన్ని మెత్తటి క్లాత్‌తో సున్నితంగా తుడుచుకోవాలి. ఎక్స్ఫోలియేషన్: దీన్నే ఫేషియల్ స్క్రబ్ అని కూడా అంటారు. ఈ స్క్రబ్ కోసం ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 టీ స్పూన్ బాదం నూనె, 1 టీ స్పూన్ రోజ్‌వాటర్ వేసి కలపాలి. ఆ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్‌ప్యాక్: ఇప్పుడు ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం లూజ్ కావడానికి కొద్దిగా రోజ్‌వాటర్‌ను వాడాలి. ముఖానికి ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకొని 10-15 నిమిషాల తర్వాత పచ్చి పాలు లేదా గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. టోనింగ్: ఈ స్టెప్‌లో నిమ్మరసం లేదా రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. దాంతో ముఖంపై జిడ్డుతనం పూర్తిగా పోతుంది. మాయిశ్చరైజర్: జిడ్డుచర్మం వారు 1 టేబుల్ స్పూన్ పాలలో పావు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖం, మెడ భాగాలకు రాసుకొని 10 నిమిషాలు మర్దనా చేసుకోవాలి. (మర్దనా ఎప్పుడూ కింది నుంచి మీదకు చేసుకోవాలి. పై నుంచి కిందకు చేస్తే చర్మం సాగుతుంది). పొడి చర్మం వారు మాయిశ్చరైజర్‌గా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవచ్చు.


