రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఇద్దరి ఎంపిక
                  
	కొత్తపల్లి : 
	స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఇద్దరు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు.  ఇటీవల కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అ«థార్టీ గ్రౌండ్లో నిర్వహించిన స్కూల్లో గ్రేమ్ ఎంపికలో సీహెచ్ నవీన్‌కుమార్, డి.స్వాతిసరస్వతి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు శుక్రవారం కర్నూలులో ప్రారంభమవుతోన్న అండర్–14 హాకీ పోటీల్లో పాల్గొంటారు. వీరిని పీఈటీ బి.సురేష్‌రాజు,  పీడీ కె.వెంకటరెడ్డి అభినందించారు.