breaking news
high voltage shock
-
వైరల్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
-
షాకింగ్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
కోల్‌కతా: రైల్వే లైన్ ఓల్టేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలుసు. ఆ తీగలను తాకిన క్షణాల్లోనే కాలి బూడిదవుతారు. అలాంటి ఓ హైఓల్టేజ్ విద్యుత్తు వైరు తెగి మీద పడితే.. ఎంత ప్రమాదమో ఊహించనక్కర్లేదు. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని ఖారగ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. అదీ ప్లాట్ ఫారమ్‌పై ఉన్న వ్యక్తిపై తెగి పడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే? ఖారగ్పూర్ రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్ ఫారమ్‌పై టికెట్ కలెక్టర్(టీసీ) నిలుచుని ఉండగా.. ఒక్కసారిగా హైఓల్టేజ్ విద్యుత్తు తీగ ఆయనపై పడింది. క్షణాల్లో తీగతో పాటే ట్రాక్‌పై పడిపోయాడు టీసీ. ఆయనతో మాట్లాడుతున్న మరో వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. బాధితుడు సుజన్ సింఘ్ సర్దార్‌గా గుర్తించారు. విద్యుత్తు షాక్‌తో తీవ్ర గాయాలైన టీసీని రైల్వే సిబ్బంది, అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. దీనిపై అనంత్ రూపనగూడి అనే రైల్వే సిబ్బంది ట్విటర్లో వీడియో షేర్ చేశారు. ‘విచిత్రమైన ప్రమాదం. ఒక పెద్ద లూస్ కేబుల్ పక్షుల వల్ల ఓహెచ్ఈ తీగపై పడింది. దీంతో హైఓల్టేజ్ తీగ టీటీఈ తలపై పడింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.’ అని రాసుకొచ్చారు. మరోవైపు.. తీగ తెగి పడడానికి గల కారణాలు తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు. A freak accident - a long piece of loose cable, taken by a bird somehow came in contact with the OHE wire and the other end came down and touched a TTE's head. He suffered burn injuries but is out of danger and under treatment - at Kharagpur station yesterday afternoon! #Accident pic.twitter.com/ObEbzd1cOF — Ananth Rupanagudi (@Ananth_IRAS) December 8, 2022 ఇదీ చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
బీజేపీకి హై ఓల్టేజీ షాకివ్వాలి
♦ హైదరాబాద్ అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదు ♦ టీయూడబ్ల్యూజే ‘మీట్ ద ప్రెస్’లో ఎంపీ కవిత హైదరాబాద్: ‘బల్దియా ఎన్నికల్లో బీజేపీకి హైవోల్టేజీ షాకివ్వాలి. మతతత్వ శక్తులకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాలి. బీజేపీ నేతలకు చిత్తశుద్ధిలేదు. ప్యాకేజీ.. లీకేజి అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రాస కోసం పాకులాడుతున్నారు తప్ప నగరంలో చేసిన అభివృద్ధేమీ లేదు. హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. బీజేపీ, టీడీపీలు ఇక్కడ అలజడి సృష్టించేందుకు చూస్తున్నాయి. రాష్ట్రంలో శాంతియుతంగా పాలన సాగుతుంటే ఓర్వలేని నాయకులు నగరంలో ఏదైనా జరిగితే బావుండనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. తండ్రి స్థానంలో ఉన్న కేంద్రం అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సింది పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ మేనిఫెస్టోను అటు, ఇటుగా మార్చి టీడీపీ, బీజేపీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది’ అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ బుధవారం నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు... లోకం తెలియని లోకేశ్... హైదరాబాద్‌లో ఉన్నవారంతా హైదరాబాదీలే. ఇతర పార్టీల బలహీనతలను ఎత్తిచూపకుండా 19 నెలల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థిస్తున్నాం. కేసీఆర్ పాలనపై ప్రజలందరూ విశ్వాసంతో ఉన్నారు. మా నాన్న, తాతల హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ లోకం తెలియని లోకేశ్‌బాబు ప్రచారం చేయడం సరికాదు. తెలంగాణ 1956కు ముందే పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను విమర్శించడం లేదు గానీ, అదే సమయంలో హై టెక్ సిటీ కట్టి అభివృద్ధంతా మావల్లేనని ప్రకటించుకోవడం సరికాదు. వ్యక్తిగత అభివృద్ధి కోసం హైటెక్ సిటీని ఉపయోగించుకున్నారు. కులమతాలు, ప్రాంతాలకతీతంగా... కుల మతాలకతీతంగా మా ప్రభుత్వం అన్ని పండుగలనూ ఘనంగా నిర్వహిస్తోంది. పార్టీలకతీతంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ అభివృద్ధి నిధులు మం జూరు చేస్తోంది. హైదరాబాద్‌లో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చాం. గోదావరి జలాలను నగరానికి తరలించాం. ‘మన నగరం.. మన పార్టీయే’ మా నినాదం. మేయర్ పదవిలో టీఆర్ఎస్ ఉంటేనే హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. రాష్ట్రం ఏర్పడితే ఇతర ప్రాంతాల వారికి భద్రత ఉండదు.. ఆంధ్ర వారిని తరిమేస్తారని తప్పుడు ప్రచారాలు చేశారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తూన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలకు వాళ్ల అధినాయకత్వంపై నమ్మకం లేకనే టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు క్రాంతి, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు. మేయర్ మహిళ కావాలని కోరుకుంటున్నా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం డివిజన్లు కేటాయించడం సీఎం కేసీఆర్ ఘనతే. మహిళలు పదవుల్లో ఉన్నచోట అవినీతి తక్కువగా ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ మేయర్‌గా మహిళ కావాలని కోరుకుంటున్నా. గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. నగరంలో కరెంట్, నీటి బకాయిలు మాఫీ చేసిన ఘనత మాదే. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో చైతన్యపరుస్తున్నాం.