breaking news
High fat
-
ఆ పాలతో నిత్య యవ్వనం..
లండన్ : వెన్నతీసిన పాలు తీసుకోవడం ద్వారా డీఎన్ఏ వయసు మీరడాన్నినియంత్రించవచ్చని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. తక్కువ కొవ్వున్న పాలను తాగేవారు వారు వారి వయసు కంటే నాలుగున్నరేళ్లు చిన్నవారిగా కనిపిస్తారని పేర్కొంది. 6000 మంది జీన్స్‌ను, వారు తీసుకునే ఆహారం, ఎలాంటి పాలు తాగుతారనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆ సర్వే కీలక వివరాలను వెల్లడించింది. క్రోమోజోముల పరిమాణం ఆధారంగా డీఎన్ఏ వయసును శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రజలు తీసుకునే పాలల్లో ఒక శాతం కొవ్వు అధికమైనా ఒక్కో శాతానికి వారి డీఎన్ఏ నాలుగేళ్ల పైగా వయసు మీరినట్టు సర్వేలో వెల్లడైంది. 0.3 శాతం కొవ్వు కలిగి ఉన్న పాలను తీసుకునే వారు 3.6 శాతం కొవ్వున్న పాలను తీసుకునే వారితో పోలిస్తే దీర్ఘకాలం యవ్వనంగా కనిపిస్తూ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని సర్వే సూచించింది. సంతృప్త కొవ్వులతో కూడిన పాలను తీసుకుంటే అది కణాలపై ఒత్తిడి పెంచి వాటిని నిర్వీర్యం చేస్తుందని శరీరంలోని కండరాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. పాలు తాగడం అనారోగ్యకరం కాదని, కానీ మీరు ఎలాంటి పాలు తాగుతున్నారనే దానిపై అవగాహన ఉండాలని పరిశోధకులు పేర్కొన్నారు. అధిక కొవ్వున్న పాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే వెన్నతీసిన పాలు డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడతాయనేందుకు పరిశోధకులు ఎలాంటి ఆధారాలు చూపకపోవడం గమనార్హం. వారు కేవలం ఈ పాలను తీసుకుంటే కలిగే ప్రభావాలను మాత్రమే పరిశీలించారు..కారణాలపై లోతుగా విశ్లేషించలేదు. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ అథ్యయనానికి ప్రొఫెసర్ లారీ టకర్ నేతృత్వం వహించారు. ఈ అథ్యయన వివరాలు సైన్స్ జర్నల్ ఆక్సిడేటివ్ మెడిసిన్ అండ్ సెల్యులార్ లాంగివిటీలో ప్రచురితమయ్యాయి. చదవండి : గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న! -
కాబోయే తల్లులూ.. వాటికి దూరంగా ఉండండి!
గర్భధారణ సమయంలో తల్లులు అధిక కొవ్వులతో కూడిన ఆహారం తీసుకుంటే.. పుట్టబోయే పిల్లల్లో మధుమేహంతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందం టోంది అమెరికాలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. శిశువుకు కొవ్వు తక్కువగా ఉండే, పుష్టినిచ్చే ఆహారాన్ని అందించడం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చొచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త యువాన్ జియాంగ్ చెబుతున్నారు. తల్లిదండ్రుల నుంచి సంతానానికి జన్యువులే కాకుండా ఆయా జన్యువులు ఏ సందర్భంలో ఎంత మేరకు పనిచేయాలన్న విషయం కూడా వారసత్వంగా అందుతుందని పేర్కొన్నారు. ఎపిజెనిటిక్స్ అనే ఈ అంశం తిండి, వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. గర్భం ధరించినప్పుడు తల్లులు అధిక కొవ్వు తో కూడిన ఆహారాన్ని తీసుకుంటే జీవక్రియలను ప్రభావితం చేసే జన్యువుల పనితీరులో మార్పులొస్తాయని ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా గుర్తించినట్లు చెప్పారు. ఈ మార్పుల్లో కొన్ని పిల్లలు పెద్దయ్యాక వారిలో మధుమేహానికి దారి తీయొచ్చని చెప్పారు. పసిపిల్లలు తల్లిపాలు తాగడం ఆపేశాక ఇచ్చే ఆహారం ద్వారా ఈ పరిస్థితిలో మార్పులు తేవొచ్చని, వ్యాధులు దరిచేరకుండా నిరోధించవచ్చన్నారు. -
ఒక్క సిట్టింగ్‌లోనే కొవ్వు మాయం
కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్ సందర్శించండి... మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ‘క్రయోలిపోలైసిస్’ ప్రక్రియతో దూరమవుతుందని చెబుతున్నారు ‘హెల్దీకర్వ్స’ వైద్యుడు డా.కిషోర్ రెడ్డి. కొందరు ఊబకాయులు బరువు తగ్గినా, పొట్ట, పిరుదులు వంటి భాగాల్లో కొవ్వు పూర్తిగా తగ్గని వారికీ, అలాగే కొందరు సన్నగా ఉన్నా పొట్ట, తొడల భాగాల్లో కొవ్వు అధికంగా చేరిన వారికి ఆహార నియమాలతో ప్రయోజనం ఉండదు. కాబట్టి వీరికి వెంటనే ‘క్రయోలిపోలైసిస్’ చేయించుకోవడం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఊబకాయం వల్ల ఒంట్లోని జీవక్రియలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. ఫలితంగా మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్టరాల్ వంటి రుగ్మతలెన్నో చుట్టుముట్టి పరిస్థితి చివరికి గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, కీళ్లనొప్పులు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఆడవారిలో గర్భ, కాన్పు సంబంధమైన సమస్యలకు ఊబకాయం కారణమవుతోంది. శరీర భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును తొలగించే అత్యంత, అధునాతన, సురక్షితమైన విధానం ‘క్రయోలిపోలైసిస్’. ‘క్రయో’ అంటే చల్లబర్చడం.. ‘లిపో’ అంటే కొవ్వు, ‘లైసిస్’ అంటే విచ్ఛిన్నం చేయడం. శరీర భాగాలను చల్లబర్చడం ద్వారా కొవ్వు కరిగించడం అన్నమాట. సర్జరీ లేకుండా.. ఒకట్రెండు సిట్టింగ్‌లలోనే శరీరంలోని కొవ్వును తొలగించుకోవచ్చు. ఇది లైపోసక్షన్‌కు ప్రత్యామ్నాయంగా సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే విధానం. దీనికి ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ‘యూఎస్ఎఫ్డీఏ’ అనుమతి కూడా లభించింది. క్రయోలిపోలైసిస్ చేసే విధానం: మొదటగా డాక్టర్ శరీరంలోని కొవ్వు పేరుకు పోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. తర్వాత శరీరం నుంచి వెళ్లిపోతాయి. క్రయోలిపోలైసిస్ కేవలం కొవ్వు కణాలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. మిగిలిన చర్మ కణాలు, కండరాలు, నాడీకణాలు యథాతథంగానే ఉంటాయి. సర్జికల్ పద్ధతి అయిన లిపోసక్షన్ చికిత్సలోని దుష్ఫలితాలను నివారించుకోవాలనుకునే వారికి క్రయోలిపోలైసిస్ సరైన ప్రత్యామ్నాయం. కొవ్వు తగ్గడం, బరువు తగ్గడం ఒకటేనని చాలామంది అపోహ పడతారు. అయితే బరువు తగ్గినప్పుడు శరీరంలోని కొవ్వు కణాల పరిమాణం చిన్నగా మారుతుంది. వాటి సంఖ్య మాత్రం అంతే ఉంటుంది. బరువు పెరిగినప్పుడు ఇవి మళ్లీ పెద్దవవుతాయి. క్రయోలిపోలైసిస్ చికిత్సా విధానం ఈ కొవ్వు కణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చికిత్స జరిగే సమయంలో మీరు ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చు! ల్యాప్‌టాప్‌పై పనిచేసుకోవచ్చు. తర్వాత ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. ఈ చికిత్స చేయించుకోవాలనుకునే వారు ముందుగా క్రయోలిపోలైసిస్ డాక్టర్ని కలిసి ఆయన సూచనలు తీసుకోవడం తప్పనిసరి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ చికిత్స జరిగిన ప్రాంతంలో శరీరం కొంత సమయం ఎర్రగా మారుతుంది. కాని కొద్ది సమయంలోనే మామూలు స్థితికి చేరుకుంటుంది. Cryoglobulinemia Ìôæ-§é- Paraxyenal Cold hemoglobinuria తో బాధ పడేవారు ఈ చికిత్స చేయించుకోరాదు. హైదరాబాద్‌లోని ‘హెల్దీకర్వ్స స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్’ అనుభవజ్ఞులైన డాక్టర్లచే అందిస్తున్న ఈ చికిత్సా విధానంతో అత్యుత్తమమైన నాణ్యతా విలువల్ని పాటిస్తూ, ఉత్తమమైన ఫలితాలను సాధిస్తుంది. Healthii Curvess Pvt Ltd, Jubleehills / Secunderabad, Cell: 9705 828282,9705 838383