breaking news
Hewlett Packard
-
ఇన్ఫీ కోల్పోయింది.. హెచ్‌పీకి దక్కుతుందా?
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ కోల్పోయింది.. హెచ్‌పీకి దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య వివాదాలతో కంపెనీ సీఈవోగా వైదొలిగిన విశాల్ సిక్కా, ఐకానిక్ అమెరికన్ సంస్థ హెచ్‌పీలో చేరబోతున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. కంప్యూటర్ సాఫ్ట్వేర్, చిప్ మేకర్ దిగ్గజం హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్(హెచ్‌పీఈ)లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా సిక్కా జాయిన్ కాబోతున్నారని పలు వర్గాలు చెప్పాయి. ఆశ్చర్యకరంగా సిక్కా రాజీనామా చేయడానికి కొన్ని రోజుల ముందే, విశాల్ సిక్కాకు సీఈవో పదవి కంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగమే మంచిదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ పోస్టులోనే విశాల్ సిక్కా చేరబోతున్నారని తెలియడం గమనార్హం. ఈ రిపోర్టులపై విశాల్ సిక్కా ఇంకా స్పందించలేదు. హ్యూలెట్ ప్యాకర్డ్ నుంచి విడిపోయి 2015లో హెచ్‌పీఈ ఏర్పడింది. ఈ సంస్థలో రెండు లక్షల మంది ఉద్యోగులున్నారు. డేటా సెంటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను హెచ్‌పీఈ విక్రయిస్తోంది. అదేవిధంగా హెచ్‌పీ పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటర్స్‌ను అమ్ముతోంది. హెచ్‌పీఈ ప్రధాన కార్యాలయం పాల్ ఆల్టో. మెక్ వైట్‌మ్యాన్ దీనికి చైర్మన్. అటు విశాల్ సిక్కా కూడా ఆ ప్రాంతానికి చెందిన వారే. దీంతో సిక్కాను ఆ కంపెనీలోకి తీసుకోవడానికి హెచ్‌పీ వెనుకాడదని తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్‌పీఈలో సీటీఓ పదవి ఖాళీగా ఉంది. గతేడాది హెచ్‌పీఈ సీటీఓగా మార్టిన్ ఫింక్ తప్పుకోవడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. మూడేళ్ల క్రితం ఇన్ఫోసిస్‌లో చేరకముందు కూడా విశాల్ సిక్కా, జర్మన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఎస్ఏపీకి సీటీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. స్టాన్‌ఫోర్డ్‌లో సిక్కా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో డాక్టరేట్ కూడా పొందారు. -
హచ్పీ స్లేట్ వాయిస్ టాబ్...
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ చేస్తూ ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ హ్యూలెట్ ప్యాకర్డ్ తాజాగా హెచ్‌పీ స్లేట్ 7 వాయిస్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. స్లేట్ 6 గత నెలలోనే మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఏడు అంగుళాల స్క్రీన్ సైజు, 1280 బై 880 రెజల్యూషన్ దీని సొంతం. దాదాపు 25 గిగాబైట్ల ఉచిత క్లౌడ్ స్టోరేజీ, హెచ్‌పీ ఈ ప్రింట్, కనెక్టడ్ ఫొటో, ఫైల్ మేనేజర్, కనెక్టడ్ మ్యూజిక్ వంటి ఉచిత అప్లికేషన్లు (మూడు నెలల అన్లిమిటెడ్ డౌన్లోడింగ్)లు దీని ప్రత్యేకతలు. డ్యుయెల్ సిమ్‌లను సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఈ ఫాబ్లెట్లో సాధారణ సైజు సిమ్ ఒకదాన్ని మాత్రమే వాడవచ్చు. రెండోదాన్ని మైక్రోసిమ్‌గా వాడాల్సి ఉంటుంది. ప్రాసెసర్: 1.2 గిగాహెర్ట్జ్, క్వాడ్‌కోర్ ప్రధాన కెమెరా: 5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా: 2 మెగాపిక్సెల్స్ ఆపరేటింగ్ సిస్టమ్: 4.2 జెల్లీబీన్ ర్యామ్: 1 జీబీ మెమరీ: 16 జీబీ ఇంటర్నల్ (మైక్రోఎస్డీ కార్డుతో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు) బ్యాటరీ: 4100 ఎంఏహెచ్