breaking news
Hero Vijay Antony
-
Tamil Nadu Assembly Election 2026 : విజయ్ పోటీ ఇక్కడి నుంచే?
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో,తమిళగ వెట్రి కగజం (టీవీకే)అధినేత విజయ్ పోటీ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గంపై టీవీకే ప్రతినిధులు పరోక్షంగా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టీవీకేతో పాటు ఇతర రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా, చెన్నైలో టీవీకే కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు.. టీవీకే ఎన్నికల క్యాంపెయిన్ మేనేజ్మెంట్ సెక్రటరీ ఆధవ్ అర్జునకి విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల విజ్ఞప్తిని పార్టీ అధినేత విజయ్‌కు వివరిస్తామని అన్నారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ మాట్లాడుతూ..‘మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. మీ తీర్మానాన్ని ‘దళపతి’కి చేరవేరుస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నమ్ముతుందని, ఉత్తర చెన్నై ప్రాంతం ఆ పరిస్థితులను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పెరంబూర్ నియోజకవర్గం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, సామాజిక సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా టీవీకే గుర్తించింది.అందుకు అనుగుణంగా పెరంబూర్,కోల్తాపూర్,ఆర్కే నగర్ ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో ఏదైనా ఒక స్థానం పోటీ చేసే అంశంపై విజయ్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
తిరుపతిలో హీరో విజయ్ ఆంటోని ‘విక్రమ్ రాథోడ్’ ఆడియో లాంచ్
-
టైటిలే ప్లస్ అయింది
- హీరో విజయ్ ఆంటోని ‘‘మొదట ఈ చిత్రానికి ‘బిచ్చగాడు’ అని టైటిల్ పెట్టినప్పుడు నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని చాలామంది అన్నారు. కానీ, ఈ చిత్రానికి టైటిలే పెద్ద ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, అంతకుమించి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇకపై నా చిత్రాల షూటింగ్స్ యాభై శాతం తెలుగు రాష్ట్రాల్లో చేస్తా’’ అని సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ బాగుండటంతో హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.‘‘కథను నమ్మి, హ్యూమన్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశా. తెలుగులో పెద్ద హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు తెలిపారు. చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో రేపటి నుంచి థియేటర్లను పెంచుతున్నాం’’ అని చెప్పారు. సినిమా విజయవంతం కావడంపై కథానాయిక సత్న టైటస్ ఆనందం వ్యక్తం చేశారు.


