breaking news
Heavy water drainage
-
హైదరాబాద్‌లో పదే పదే.. అదే సీన్
వర్షం కురిసిన ప్రతిసారీ నగరం వణికిపోతోంది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఎప్పటిలాగే పలు కాలనీలు, బస్తీలతోపాటు ప్రధాన రహదారులు నీట మునిగాయి. వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. అధికారుల లెక్కల మేరకు నగరంలో 200 వాటర్‌లాగింగ్ ప్రాంతాలుండగా, లెక్కలో లేనిప్రాంతాలు ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో శుక్రవారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ మధ్య కేంద్రీకృతమైందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగ రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటి ంచింది. బేగంపేటలోని ద్వారకాదాస్ సొసైటీలో ఇలా.. కాగా గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో 9–10 సెంటీమీటర్ల మేర కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీ ల వా సులు నానా అవస్థలు పడ్డారు. కాగా రాత్రి 10 గంటల వరకు ఆర్సీ పురంలో 4.8 సెం.మీ., శేరిలింగంపల్లి 3.0, ఖాజాగూడ 2.6, మణికొండ 2.5, బీహెచ్ఈఎల్ 2.4, రాయదుర్గం 1.9, షేక్‌పేట్ 1.9, లింగంపల్లి 1.6, మెహిదీపట్నం 1.5, గుడిమల్కాపూర్‌లో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం ► మూడు గంటల్లోనే దాదాపు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎక్కువ ప్రభావం కనిపించింది ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, కూకట్పల్లి, కృష్ణాగర్, లక్డీకాపూల్,పంజగుట్ట తదితర ప్రాంతాల్లో వర్ష తాకిడికి ప్రజలు అల్లాడిపోయారు ► ప్రధాన రహదారుల ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు నిలిపోవడంతో ముందుకు కదల్లేక వాహనవారులు పడరాని పాట్లు పడ్డారు ► నగర ప్రజలకు సుపరిచితమైన రాజ్‌భవన్‌రోడ్, ఒలిఫెంటా బ్రిడ్జి, మైత్రీవనం, విల్లామేరీ కాలేజ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వంటి ప్రాంతాల్లోనే కాక పలు కొత్తప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది ► జీహెచ్ఎంసీకి 59 ఫిర్యాదులందాయి. వీటిల్లో 40 నీటినిల్వలకు సంబంధించినవి కాగా, 19 ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఫిర్యాదులందని సమస్యలు ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి -
అప్రమత్తంగా ఉండండి : ఉమా
కోడూరు/(చిలకలపూడి)మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. శుక్రవారం రాత్రి కోడూరు మండలం పాలకాయతిప్ప సమీపంలోని సముద్ర తీరాన్ని జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుపాను వీడే వరకు అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. తీరంలో పరిస్థితిని బందరు ఆర్డీవో సాయిబాబు, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసుదనరావు వివరించారు. మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరావు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, మచిలీపట్నం మాజీ మున్సిపాల్ చైర్మన్ బచ్చుల అర్జునుడు, డ్రైనేజీ డీఈ మారుతీ ప్రసాద్, తహశీల్దార్ ఎంవీ సత్యనారాయణ, ఎంపీడీవో కె.జ్యోతి పాల్గొన్నారు. బందరులో సమీక్ష తుపానుపై మంత్రి దేవినేని ఉమా శుక్రవారం రాత్రి మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ మురళి, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు. పులిచింతల నుంచి వచ్చే ఖరీఫ్‌కు 42 టీఎంసీల సాగునీరు కోడూరు : వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పులిచింతల ప్రాజెక్టు ద్వారా 42 టీఎంసీల నీటిని నిలువ చేసి, కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. కోడూరు మండలంలోని మాచవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో మంత్రి ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రూ.30 కోట్లు పింఛన్లు ఇచ్చి పేదలకు భరోసా కల్పించినట్లు తెలిపారు.