breaking news
health is wealth
-
బ్రిటన్ హిందువుల ఆరోగ్యం భేష్ !
లండన్: ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అంటారు. దానికి తగ్గట్టుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హిందువులకి మించిన వారు లేరని బ్రిటన్‌లోని ఒక సర్వేలో తేలింది. బ్రిటన్‌లో నివసించే హిందువులు అత్యంత ఆరోగ్యవంతులు , విద్యాధికులని తేలితే, సిక్కులందరికీ దాదాపుగా సొంతిల్లు ఉందని వెల్లడైంది. ఇంగ్లండ్, వేల్స్‌లోని జనగణన సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూకేలో ఆఫీస్ ఫర్ నేషనల్ స్టేటస్టిక్స్ (ఒఎన్ఎస్) ఈ జనగణన వివరాలను విడుదల చేసింది. ‘‘2021లో మార్చిలో జరిపిన ఈ సర్వేలో హిందువుల్లో ఆరోగ్యంగా ఉన్నవారు 87.8% ఉంటే, మొత్తంగా జనాభాలో 82%మంది ఆరోగ్యంతో ఉన్నారు. ఇక ఉన్నత విద్యనభ్యసించిన హిందువులు 54.8% ఉంటే, మొత్తం బ్రిటన్ జనాభాలో 33.8% ఉన్నారు. ఇక సిక్కుల్లో 77.7% మంది సొంతిళ్లలో నివసిస్తున్నారు.ఉద్యోగాల్లేక అవస్తలు పడుతున్న వారిలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. బ్రిటన్‌లో నివసిస్తున్న 16–64 ఏళ్ల మధ్య వయసున్న ముస్లింలలో 51% మందే ఉద్యోగాలు చేస్తున్నారు’’ అని సర్వే నివేదిక వివరించింది. -
నాలో కూడా కొన్ని లోపాలున్నాయి!
‘‘ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆ విషయాన్ని నేను బాగా నమ్ముతాను. అందుకే, ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకుంటాను’’ అన్నారు తమన్నా. అకాల భోజనం, మితిమీరిన ఆహారం కూడదని కూడా సలహా ఇస్తున్నారామె. ఈ మిల్క్ బ్యూటీ సినిమాల్లోకొచ్చి దాదాపు ఏడేళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో తమన్నా శరీరాకృతిలో పెద్దగా మార్పు రాలేదు. సన్నగా ఉండటం కోసం ఆల్మోస్ట్ కడుపు మాడ్చేసుకుంటారా? అని అడిగినప్పుడు పై విధంగా స్పందించారామె. బరువు పెరుగుతామని కొంతమంది సరిగ్గా తినరని, అలా చేస్తే ఆరోగ్యం పాడవుతుందని, ఆరోగ్యానికి మంచివి ఎంచుకుని తింటే మంచిదని సూచించారామె. అది మాత్రమే కాదు.. చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుందని చెబుతూ -‘‘ఈప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి. నాలో కూడా కొన్ని లోపాలున్నాయి. అవి ఎవరికీ హాని చేయని లోపాలు. అందుకే, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే, మంచి పక్కన చెడు ఉంటేనే.. మంచి బాగా ఎలివేట్ అవుతుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం హిందీలో ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’, ‘హమ్ షకల్స్’ చిత్రాల్లో నటిస్తున్నారామె. తెలుగులో ‘ఆగడు’, ‘బాహుబలి’ చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నానని తమన్నా పేర్కొన్నారు. జనరల్‌గా మీకెలాంటి సినిమాలంటే ఇష్టం అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘నాకు పాపులర్ సినిమాల్లో నటించడం ఇష్టం. పాపులర్ సినిమాలంటే అన్ని వర్గాలవారూ చూడదగ్గవి అన్నమాట. ఆ తరహా సినిమాల్లో నటించడంవల్ల ప్రేక్షకులందరికీ దగ్గరవ గలుగుతాం అని నా ఫీలింగ్’’ అని చెప్పారు.