వర్క్చార్జ్ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ
అనంతపురం సిటీ : పంచాయతీ రాజ్ సర్కిల్ కార్యాలయంలో వర్క్ చార్జ్ ఉద్యోగులకు ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవికుమార్ హెల్త్ కార్డులను బుధవారం పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర వర్క్చార్జ్ ఉద్యోగుల అసోషియేష¯ŒS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఆరోగ్య భద్రత విషయంలో ఈ కార్డులు ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటాయన్నారు.
ఇక పదోన్నతులు, ఇతర సమస్యలపై ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అసోషియేష¯ŒS అధ్యక్షులు డి.జి ప్రసాద్‌రావు, ముత్యాలప్ప, అబ్దుల్ ఎస్‌బాబు తదితరులు వర్క్ చార్జ్ ఉద్యోగుల సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు.