breaking news
HC judges
-
రిటైర్డ్ జడ్జీల సదుపాయాల్లో ఏకరూపకత ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులకు కల్పించే సదుపాయాలన్నీ ఒకే తరహాలో ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం రెండు వారాల్లోగా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీలకు కల్పిస్తున్న భద్రత, ఇతర సదుపాయాలపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. పదవీ విరమణ తర్వాత జడ్జీలకు అందుతున్న వసతులు రాష్ట్రానికో తీరుగా ఉండటంపై ఈ సందర్భంగా ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలు భద్రత నిమిత్తం ఇస్తున్న ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడింది. ‘రూ.45 వేల నుంచి రూ.50 వేలతో ప్రస్తుత పరిస్థితుల్లో డ్రైవర్, సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించుకోవడం సాధ్యమేనా?‘అని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నించారు. వసతి, వైద్య ఖర్చులు, డ్రైవర్, వంట మనుషులు, టెలిఫోన్ వంటి కనీస సదుపాయాల్లో హెచ్చుతగ్గులు ఉండటానికి వీల్లేదని, ఏ రాష్ట్రంలో సేవలందించారన్న దానితో సంబంధం లేకుండా దేశమంతటా ఒకే విధానం ఉండాలని స్పష్టం చేశారు. ఒక వేళ కేంద్రం స్పందించకుంటే తామే స్వయంగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం ధర్మాసనం సూచనపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కమిటీని ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. ఇది కచ్చితంగా పరిష్కరించాల్సిన సమస్యేనని, న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామన్నారు. ఈ అంశంపై రెండు వారాల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, మూడు నెలల్లోగా సిఫార్సులతో కూడిన నివేదికను కేంద్రంతో పాటు సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. -
వారంపాటు నగదు విత్‌డ్రా చేయం
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు.. ఆపై నెలారంభం కావడంతో సామాన్యులకు కొంత మేరకైనా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజులదాకా తమ జీతాలకు సంబంధించిన డబ్బును తమ ఖాతాల నుంచి తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. న్యాయమూర్తులందరూ గురువారం స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు న్యాయమూర్తులు, ఉద్యోగులకు హైకోర్టులోని ఎస్బీహెచ్లో జీతాల ఖాతాలున్నాయి. ఒక్కో వ్యక్తి వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో 22 మంది న్యాయమూర్తులు తమ తమ ఖాతాల నుంచి ఆ మొత్తాలను ఉపసంహరించుకుంటే ఉద్యోగులకు నగదు సమస్యలు ఏర్పడతాయని, అందువల్ల ఓ వారం రోజులపాటు నగదు ఉపసంహరణ చేయకుండా ఉంటే కనీసం హైకోర్టు ఉద్యోగులకు కొంత మేరైనా సాయం చేసినట్లు ఉంటుందని భావించిన న్యాయమూర్తులు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులకు జీతాలు అందించేందుకు హైకోర్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అటెండర్లకు రూ.10వేలు, మిగిలిన ఉద్యోగులు, అధికారులకు రూ.8వేల నగదు అందచేయనున్నది. -
కొలీజియం సంక్షోభం


