breaking news
hardik patel close aides
-
గుజరాత్లో ఊహించని పరిణామం
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాడని అంచనాలు పెట్టుకున్న హర్దిక్ పటేల్‌కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరులుగా చెప్పుకునే వరుణ్ పటేల్, రేష్మ పటేల్‌లు బీజేపీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) లో కీలక నేతలుగా వీరిద్దిరి పేర్లే ఎక్కువగా వినిపిస్తుండేవి. అంతేకాదు పటేల్ ఉద్యమంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రసంగాలు గుప్పించని వారిలో వీరే ముందుడటం కొసమెరుపు. బీజేపీ చీఫ్ అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌తో భేటీ అనంతరం వారు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు జీతు వగ్హని మీడియా సమక్షంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరుణ్, రేష్మలు మాట్లాడుతూ.. హర్దిక్ కాంగ్రెస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ఉద్యమం వంకతో ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయటమో.. లేక కాంగ్రెస్ ను అధికారంలోకి తేవటమో తమ ఉద్దేశం కాదని, పటేల్‌లను ఓబీసీ కోటా చేర్చాలన్నదే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఆదివారం వీరిద్దరు కమలం కండువా కప్పుకోనున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. కాగా, ఎవరు తనను వీడినా ఒంటరి పోరాటానికైనా తాను సిద్ధమంటూ హర్దిక్ ట్విట్టర్ లోతెలియజేశాడు. ఇదిలా ఉంటే గుజరాత్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. దీనికి తోడు తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపిన కొద్ది గంటల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. -
హార్దిక్ పటేల్ అసలు లక్ష్యం.. డబ్బు, అధికారం!
హార్దిక్ పటేల్.. దేశంలో ఈ పేరు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పటేళ్లను బీసీలలో చేర్చాలంటూ ఆయన సాగించిన ఉద్యమం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ, అసలు హార్దిక్ పటేల్ ఆ ఉద్యమం ఎందుకు చేశాడన్న విషయమై ఒకప్పుడు ఆయనకు సన్నిహిత సహచరులుగా ఉన్నవాళ్లు వెల్లడిస్తున్న అంశాలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. తాను ఒక్క ఏడాది కాలంలోనే నాయకుడిగా ఎదగాలని, దాంతోపాటు కోటీశ్వరుడిని కావాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యమం మొదలుపెట్టాడని అంటున్నారు. గతంలో హార్దిక్ పటేల్‌కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న చిరాగ్ పటేల్, కేతన్ పటేల్ ఈ విషయాలు వెల్లడించారు. నియంత వ్యవహారం మానకపోతే అతడి చీకటి నిజాలను బయటపెడతామని హెచ్చరించారు. దీనిపై హార్దిక్‌కు బహిరంగ లేఖ రాశారు. ''మీరు నాయకుడిగా ఎదగాలని, భారీ మొత్తంలో డబ్బు కూడగట్టుకోవాలని స్వార్థంతో వ్యవహరించారు. దానివల్ల పటేల్ వర్గంతో పాటు మన సంస్థకు కూడా భారీ నష్టం జరిగింది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవాళ్ల కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి హార్దిక్, ఆయన స్నేహితులు విలాసవంతమైన జీవితం గడిపారని, అమరులకు సాయం చేయడానికి సేకరించిన విరాళాలతో హార్దిక్, ఆయన మామ విపుల్భాయ్ ఖరీదైన కార్లు కొన్నారని ఆరోపించారు. సాధారణంగా జైలుకు వెళ్లారంటే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లడమే కష్టమని, కానీ హార్దిక్ మాత్రం జైలుకు వెళ్లిన తర్వాత కోటీశ్వరుడు అయ్యాడని చిరాగ్, కేతన్ అన్నారు. గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత హార్దిక్ పటేల్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్రాంతానికి వెళ్లాడు. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని కోర్టు ఆదేశించడంతో అలా చేశాడు. ఇక కేతన్, చిరాగ్ చేసిన ఆరోపణలపై హార్దిక్ గానీ, ఆయన అనుచరులుగానీ ఏమీ స్పందించలేదు. హార్దిక్ పటేల్ తొమ్మిది నెలల పాటు జైల్లో ఉండగా, చిరాగ్.. కేతన్ కూడా దాదాపు 8 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. గుజరాత్లో 2015 ఆగస్టు 25న పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నిర్వహించిన ర్యాలీలో భారీ స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అహ్మదాబాద్ పోలీసులు వీరిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. హార్దిక్ పటేల్ ఇటీవల చిరాగ్, కేతన్‌లను పక్కనపెట్టి వేరే బృందాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. హార్దిక్ నియంతలా వ్యవహరిస్తాడని, పటేళ్లు రిజర్వేషన్లు పొందే అవకాశాలను సర్వనాశనం చేశాడని వాళ్లు ఆరోపిస్తున్నారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం అతడు మాత్రమే జైల్లో ఉన్నట్లు మీడియాకు చెప్పాడని, అతడితోపాటు తాము కూడా జైల్లోనే ఉన్నామన్న విషయం మర్చిపోయాడని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలా వ్యవహరించడం మానకపోతే అతడికి సంబంధించిన మరిన్ని 'చీకటి నిజాలను' వెల్లడిస్తామని హెచ్చరించారు.