breaking news
Half Saree Function
-
లేటెస్ట్ లంగా ఓణి..! బుట్టబొమ్మల్లా అమ్మాయిలు..
ఫ్యాషన్‌లో ఎన్నో డిజైన్స్ మనల్ని పలకరిస్తుంటాయి. అంతే వేగంగా ఆ డిజైన్స్ కనుమరుగవుతుంటాయి. కానీ, మనదైన సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిల అలంకరణలో భాగమైన హాఫ్ శారీ అబ్బాయిల అలంకరణలో ధోతీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే ఉంటాయి. హాఫీ శారీ వేడుక టీనేజ్‌ను దాటేస్తూ ముందుకు వెళ్లి అమ్మాయి జ్ఞాపకాలలో నిలిచే అందమైన రోజవుతుంది. హైదరాబాద్ డిజైనర్ భార్గవి కూనమ్ హాఫ్ శారీస్ డిజైన్స్‌లో వస్తున్న గ్రాండ్‌లుక్‌ని ఇటీవల మరింత ఆకర్షణీయంగా ఆవిష్కరించారు. ‘‘తెలుగింటి సంప్రదాయంలో పెళ్లి ముఖ్యమైన వేడుక. అంతే వేడుకగా ఒకమ్మాయి జీవితంలో కుటుంబసభ్యులందరూ కలిసి పండగలా జరుపుకునేది హాఫ్ శారీ ఫంక్షన్. ఇటీవల పెళ్లికి చేసిన విధంగానే హాఫ్‌శారీ ఫంక్షన్‌ను హల్దీ, మెహందీ .. అంటూ నాలుగు రోజుల పాటు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పన్నెండేళ్ల లోపు అమ్మాయిలకు చేసే ఈ వేడుకలో బుట్టబొమ్మలా కనిపించే అమ్మాయిలపైనే అందరి దృష్టి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా తమ కూతుళ్లను ఆ విధంగా చూసుకోవడానికి చాలా సంతోషిస్తుంటారు. మన చేనేతలుబెనారస్, కంచి, పైథాని పట్టు, చికంకారి జరీ కోటా .. తో చేసిన హాఫ్ శారీ, ధోతీ డిజైన్స్ ఇవి. లైట్ కలర్స్‌కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పట్టు, కోటా ఫ్యాబ్రిక్ ఉపయోగించాం. జరీ వర్క్‌తో చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేనేతలకు మరింత గ్రాండ్ లుక్ వచ్చింది. అంటే చేనేతలు – ఎంబ్రాయిడరీ– ఆభరణాలతో కలిపి చేసిన క్రియేటివ్ జర్నీ ఇది. ఆభరణాల మార్క్హాఫ్ శారీస్‌కు ఆభరణాల కాంబినేషన్ కూడా అత్యంత ముఖ్యమైనది. ఆకర్షణీయమైన లుక్ క్రియేట్ చేయడానికి పట్టు– జ్యువెలరీతో కలిసి చేసిన కాంబినేషన్ వర్క్ ఇది. లంగాఓణీ కాంబినేషన్ డ్రెస్ మనదైన సంప్రదాయ డ్రెస్ కాబట్టి, దీనికి మన సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ బాగా నప్పుతుంది. ఎంబ్రాయిడరీని మ్యాచ్ చేస్తూ పెద్ద పెద్ద హారాలు, డైమండ్ జ్యువెలరీతో మరిన్ని హంగులను తీసుకువచ్చాం’’ అని వివరించారు భార్గవి కూనమ్. (చదవండి: బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..) -
గ్రాండ్‌గా దిల్ రాజు మనవరాలు ఇషిక శారీ ఫంక్షన్ (ఫోటోలు)
-
'ఇటు రావే నా గాజు బొమ్మ'.. ఆ పాటతో తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక!
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలుస వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మరో వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'ఇటు రావే నా గాజు బొమ్మ' అనే సాంగ్‌ను ఈ వీడియోకు జతచేశారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలోని ఈ పాట తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమను తెలిపేలా ఉంది. తన కూతురి కోసం ఒక తండ్రి పడే తపనను ఈ ఒక్క పాటలో చూపించారు. తన ముద్దుల కూతురిని తలచుకుని అలేఖ్య ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కుమార్తెను ముద్దాడింది.తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.తారకరత్న జర్నీకాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఇంత అద్భుతంగా చేశారా?
-
తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఇంత అద్భుతంగా చేశారా?
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్య. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సందడి చేశారు. ఇంటిని అలంకరించిన తీరు అభిమానులను కట్టిపడేస్తోంది. (ఇది చదవండి: తారకరత్న కూతురు బర్త్ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!)కాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nishka Nandamuri (@nishkatarakratna) -
నందమూరి తారకరత్న కూతురి హాఫ్ శారీ ఫంక్షన్.. ఫోటోలు
-
నటుడు కృష్ణుడు కూతురి హాఫ్సారీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
-
మేనేజర్ కూతుళ్ల హాఫ్ సారీ ఫంక్షన్లో రవితేజ సందడి
Ravi Teja Attend His Manager Srinivas Raju Daughters Half Saree Function: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ ఫుల్ జోష్‌తో షూటింగ్ పూర్తి చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన దగ్గర పనిచేసే వ్యక్తులతో ఎంతో ఉదారంగా ఉంటాడు రవితేజ. వారికి సంబంధించిన వేడుకలకు హాజరవుతూ ఇంట్లో మనిషిలా చూసుకుంటాడు. రవితేజ వద్ద శ్రీనివాస రాజు మేనేజర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రాజుకు అనన్య, నిత్య ఇద్దరు కుమార్తెలు. వారికి హాఫ్ సారీ ఫంక్షన్‌ను ఆదివారం (ఫిబ్రవరి 27) రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ హాజరై సందడి చేశారు. అనంతరం అనన్య, నిత్యలను ఆశీర్వదించాడు. అలాగే ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్, యంగ్ హీరో తేజ సజ్జా, నటుడు బ్రహ్మాజీ ఫైట్‌మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మేనేజర్ ఇంట ఫంక్షన్లో మాస్ మహారాజ సందడి (ఫోటోలు)
-
పీవీపీ ఇంట్లో సినీ తారల సందడి


