తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఇంత అద్భుతంగా చేశారా? | Taraka Ratna's Daughter Half Saree Function Video Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Tarakaratna: తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఈ అద్భుతమైన వీడియో చూశారా?

Nov 1 2024 10:18 AM | Updated on Nov 1 2024 11:14 AM

Taraka Ratna's Daughter Half Saree Function Video Goes Viral In Social Media

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్య. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్‌ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సందడి చేశారు. ఇంటిని అలంకరించిన తీరు అభిమానులను కట్టిపడేస్తోంది. 

https://www.sakshi.com/video/cinema/taraka-ratnas-daughter-half-saree-function-video-goes-viral-social-media-2238364

(ఇది చదవండి: తారకరత్న కూతురు బర్త్‌ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!)

కాగా.. ఒకటో నంబర్‌ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement