పెరిగిన హజ్‌యాత్ర–2017 కోటా
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2017 కోటా భారీగా పెరిగింది. సౌదీ ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి మరో 34 వేల మంది హజ్‌యాత్ర చేసేందుకు అవకాశం లభిం చింది. భారతదేశానికి హజ్‌యాత్ర కోటా గతేడాది 1.36 లక్షలు కేటాయించగా ఈసారి అది 1.70 లక్షలకు పెరిగింది.
గత 30 ఏళ్లల్లో ఇంత భారీస్థాయిలో కోటా పెర గడం రికార్డుగా చెప్పవచ్చు. కాగా, హజ్ యాత్ర–2017 కు దరఖాస్తు చేసుకోవ డానికి ఈ నెల 24 వరకు గడువు ఉంది. మనదేశానికి చెందిన ముస్లిం ఎవరైనా హజ్ యాత్ర కోసం ఆయా రాష్ట్రాల హజ్ కమిటీల ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. హజ్ దరఖాస్తుతోపాటు అవసరమైన డాక్యుమెంట్లు రెండు కలర్ ఫొటో లు, పాస్‌పోర్ట్ కాపీ, అడ్రస్ ఫ్రూఫ్ (రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్లు, టెలిఫోన్ ల్యాండ్ లైన్బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ కనెక్షన్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, క్యాన్సల్డ్ బ్యాంక్ చెక్, రూ.300 లకు సంబంధించిన చలానా (స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా, లేదా యూనియన్ బ్యాంక్)లు సమర్పించాల్సి ఉంటుంది.