breaking news
Hair Pack
-
హెయిర్ ప్యాక్
కమలా పండు సగ భాగం, కొన్ని కీరా ముక్కలు, శీకాకాయ పొడి మూడు టీ స్పూన్లు, పెసరపిండి ఐదు టీ స్పూన్లు తీసుకుని, అన్నింటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.ప్యాక్ వేసుకునే విధానం: దువ్వెనతో జుట్టు చిక్కులు లేకుండా దువ్వుకోవాలి, తర్వాత నూనెలో కరివేపాకు వేసి గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఈ నూనెను తలకుపట్టించుకుని మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ప్యాక్‌ను జుట్టంతా పట్టించుకోవాలి. ఆ తరువాత ప్రశాంతంగా కూర్చుని మీకు నచ్చే మ్యూజిక్ వింటూ ఒక గంట తర్వాత హెయిర్‌వాష్ చేసేయండి. ఈ ప్యాక్ కేశాలకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. తేడా మీరే గమనిస్తారు. -
కాకర ప్యాక్
ఫెయిరీ హెయిర్ కాలుష్యం కారణంగా జుట్టు రాలే సమస్య ఈ రోజుల్లో అందరికీ సర్వ సాధారణంగా మారింది. అందుకు ఈ హెయిర్ ప్యాక్‌ను వేసుకొని చూడండి. కాకరకాయ గుజ్జులో కొద్దిగా పంచదార కలిపి ఓ 15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత దాన్ని పొడిగా ఉన్న మాడుకు ప్యాక్ వేసుకోండి. 5-6 నిమిషాల పాటు ఆ మిశ్రమంతో మాడుకు మర్దన చేసి, రెండు నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో తలను కడిగేసుకుంటే జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. -
శిరోజాల సంరక్షణ
పండ్లతో... నిమ్మ: శరీర సంరక్షణలో నిమ్మరసం మేలైనది. ఎక్కువ ఖర్చు లేకుండానే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బయటకు వెళ్లేముందు నిమ్మరసాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి, జుట్టుకు స్ప్రే చేయాలి. దీంతో సూర్యకాంతి నేరుగా శిరోజాలకు తగిలి, దెబ్బతినకుండా ఉంటాయి. తలస్నానం చేయడానికి ముందు నిమ్మరసాన్ని మాడుకు పట్టించి, రుద్దితే చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఎక్కువ జిడ్డుగా ఉంటే, నిమ్మరసం కలిపిన నీటిని తలను శుభ్రపరచడానికి వాడాలి. బొప్పాయి: బొప్పాయి గుజ్జు సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. తలలోని దుమ్ము, జిడ్డును పోగొట్టడమే కాదు రసాయనాల గాఢతను తొలగిస్తుంది. బొప్పాయిలో ఉండే ఎ, సి విటమిన్లు పొటాషియమ్, మెగ్నిషయం గుణాల వల్ల వెంట్రుకలు నిగనిగలాడుతాయి. పావుకప్పు బొప్పాయి గుజ్జును తలకు పట్టించి, అరగంట తర్వాత నీటితో శుభ్రపరచండి. జుట్టుకు ఈ మాస్క్ మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపులోనూ బొప్పాయి మహత్తరంగా పనిచేస్తుంది. అవకాడో: ఈ పండ్ల గుజ్జు క్రీమీగా ఉంటుంది. దీంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. బొప్పాయి లాగానే అవకాడో గుజ్జును మెత్తగా రుబ్బి, జుట్టుకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెలుసుగా మారి జీవం కోల్పోయిన జుట్టుకు ఈ ప్యాక్ ఇన్స్టంట్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.