-
Sabbam Hari: లాన్ వెనక మాస్టర్ ప్లాన్?.. ఎవరీ అప్పారావు...?
సాక్షి, విశాఖపట్నం: సబ్బు బిళ్ల.. కుక్క పిల్ల కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. గెడ్డలు, పార్కు స్థలాలు.. కావేవీ ఇంటి నెంబర్లను కేటాయించేందుకు అనర్హం అన్నట్టు జీవీఎంసీ తయారైంది. పదేళ్లుగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వెనక తూర్పున గల ఖాళీ స్థలంలో రెండు షెడ్లు ఉన్నట్టుగా పేర్కొని ఏకంగా ఇంటి నెంబర్లను కూడా జీవీఎంసీ కేటాయించింది. అప్పారావు పేరు మీద 355 గజాల స్థలానికి 50–1–40/18(3), 50–1–40/(4) ఇంటి నెంబర్లను ఇచ్చింది. ఈ స్థలం విలువ మార్కెట్లో రూ.5 కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థలాన్ని విక్రయించేందుకు కొద్ది మంది రంగంలోకి దిగినట్టు సమాచారం. కేవలం ఇంటి నెంబర్లతో పాటు 1980 ప్రాంతంలో అగ్రిమెంటు చేసుకున్న కాగితాలతోనే ఈ స్థలాన్ని విక్రయించేందుకు పావులు కదులుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అసలు ఖాళీ స్థలంలో షెడ్లు ఉన్నట్టుగా ఇంటి నెంబర్లు ఎలా ఇచ్చారు? ప్లాన్ అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే అసలు ఇళ్లు ఎక్కడకు వెళ్లాయి? అనే వివరాల లోతుల్లోకి వెళితే అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్బం హరి ఇంటి ప్లాన్‌లో కూడా అప్పారావుకు షెడ్డు ఉన్నట్లు చూపించారు. ఎవరీ అప్పారావు...? వాస్తవానికి సీతమ్మధారలోని సబ్బం హరి ఇంటి వెనకాల తూర్పు వైపున లాన్ ఉంది. దీనికి ఆనుకుని జీవీఎంసీ పార్కు ఉంది. ఇన్ని రోజులుగా ఈ లాన్ మొత్తం సబ్బం హరి ఇంటి ఆవరణ భాగమని అందరూ అనుకున్నారు. ఈ స్థలం కాస్తా ఎం.అప్పారావు పేరు మీద ఉంది. తాజాగా సబ్బం హరి తీసుకున్న రుణంపై ఆయన ఆస్తులను అటాచ్ చేసుకుంటామంటూ న్యాయవాది ద్వారా వచ్చిన ప్రకటనలోనూ సబ్బం హరి ఇంటికి తూర్పు భాగంలో ఉన్న స్థలం అప్పారావుకు చెందిన షెడ్లుగా పేర్కొన్నారు. అయితే, ఇంతకీ ఎవరీ అప్పారావు అంటే సబ్బం హరికి శిష్యుడుగా ఉండేవారని తెలుస్తోంది. తన స్థలాన్ని ఇన్ని రోజులుగా లాన్‌గా ఉపయోగించుకుంటున్నా అప్పారావు ఎందుకు మిన్నకుండిపోతున్నారు? అసలు షెడ్లు లేకపోయినప్పటికీ పదేళ్లకుపైగా ఎందుకు అప్పారావు ఇంటి పన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే మొదటగా జీవీఎంసీకి ప్లాన్ ఇచ్చి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీకి చెందిన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఇవేవీ లేకుండానే అప్పట్లో ఇంటి నెంబర్లను ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జీవీఎంసీ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.5 కోట్ల స్థలంపై కన్ను...! ఇన్ని రోజులు ఇంటి లాన్‌గా ఉపయోగించుకుంటున్న స్థలం తమదేనని సబ్బం హరి కుటుంబీకులు భావిస్తున్నారు. సబ్బం హరి మరణం తర్వాత కూడా ఇదంతా తమ స్థలమేనని భ్రమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజాగా కోర్టు నుంచి అటాచ్మెంట్ వ్యవహారంలో తమ ఇంటి సరిహద్దుల్లో తూర్పువైపు అప్పారావు షెడ్లు ఉన్నట్టు చూపించారు. తీరా చూస్తే తూర్పు వైపునకు లాన్‌కు ఆనుకుని జీవీఎంసీ పార్కు మాత్రమే ఉంది. దీనితో అసలు వ్యవహారాన్ని కొద్ది మంది డాక్యుమెంట్లతో సహా వెలికితీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే ఈ 355 గజాల స్థలాన్ని తక్కువ ధరకు తమ చేతుల్లోకి తీసుకునేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సబ్బం హరి కుటుంబీకుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ స్థలం వ్యవహారంపై మరింత లోతుల్లోకి వెళ్లి జీవీఎంసీ రికార్డులను పరిశీలిస్తే ఇన్ని రోజులుగా లాన్‌గా ఉపయోగించుకుంటూ అనుభవించిన సబ్బం హరి కుటుంబీకుల పాత్ర ఉందా? ఇంకా తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలనుంది. -
'అదితి మరణంపై కోర్టులో పిల్'
విశాఖ: క్షేమంగా తిరిగి వస్తుందనుకున్న అదితి విగతజీవిగా మారిపోవడంపై పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ చిన్నారి అదితి మృతిపై మండిపడుతోంది. బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ నిర్లక్ష్యం, ఆక్రమణదారులే చిన్నారి అదితిని పొట్టనపెట్టుకున్నాయని మండిపడ్డారు. అదితి దుర్మరణంపై కోర్టులో పిల్ దాఖలు చేస్తానని ఆయన అన్నారు. మరోవైపు ఈనెల 4వ తేదీన ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి గల్లంతై విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరంలో విగతజీవిగా మారినన ఆరేళ్ల చిన్నారి అదితి అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీంతో కుటుంబసభ్యుల ఆవేదన వర్ణనాతీతం. ముఖ్యంగా కన్నతల్లి కడుపుశోకం గుండెల్ని పిండేసింది. ఏ సంబంధమూ లేకపోయినా నగరమంతా తరలివచ్చింది. ఎక్కడో ఒకచోట క్షేమంగా తిరిగి వస్తుందనుకున్నామని అందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ఎనిమిది రోజులుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని నిరీక్షించిన వారికి.. ఈ ఘటన తీరని గుండెకోతను మిగిల్చింది. చిన్నారి అదితి కానరాని లోకాలకు తరలి వెళ్లి అందరిలోనూ విషాదాన్ని నింపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement