breaking news
GVMC area
-
జీవీఎంసీ కౌన్సిల్.. 18 అజెండా, 27 సప్లిమెంటరీ అంశాలపై చర్చ!
విశాఖపట్నం: మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్న జీవీఎంసీ సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీన కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా.. మిచాంగ్ తుపాను కారణంగా వాయిదా పడింది. ఆ రోజు వాయిదా పడ్డ 18 అంశాలతో పాటు మరో 27 అంశాలు నేడు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. ► 2023–24 ఏడాదిలో డిసెంబర్ 13 నుంచి మార్చి 31, 2024 వరకు జోన్–4 టౌన్‌కొత్తరోడ్డు వద్ద గల సీసీఎస్ ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా అద్దె ప్రాతిపదికన టిప్పర్లు, బ్యాక్ హోయ లోడర్‌కు పరిపాలన ఆమోదం, ఎన్బీసీ, గ్రీన్ బిల్డింగ్ నిర్మాణపు మార్గదర్శకాలకు అనుగుణంగా అంచనా విలువ రూ.99.47 కోట్లతో ముడసర్లోవలోని 4.37 ఎకరాల్లో జీవీఎంసీ నూతన ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వ పరిపాలన ఆమోదానికి సభ్యులు చర్చించనున్నారు. ► సాగర్‌నగర్‌కు ఎదురుగా బీచ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న బీచ్ స్థలంలో ఎకోఫ్రెండ్లీ తాబేలు బీచ్ అభివృద్ధి, ఉద్యానవన విభాగంలో గ్రీనరీ అభివృద్ధి, పర్యవేక్షణకు కాంట్రాక్ట్ పద్ధతిలో 8 మంది జోనల్ హర్టికల్చర్ అధికారుల నియామకం, పూర్ణామార్కెట్ జంక్షన్ నుంచి టౌన్‌కొత్తరోడ్డు జంక్షన్ వరకు రూ.1,34,02,077 అంచనా విలువతో రోడ్డుకిరువైపులా ఉన్న 55 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ► రూ.1,46,45,690 అంచనా విలువతో రీడింగ్ రూమ్ జంక్షన్ నుంచి పాతపోస్టాఫీస్ జంక్షన్ వరకు 69 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు, రూ.62,01,254 అంచనా విలువతో చౌల్ట్రీ జంక్షన్ నుంచి పూర్ణామార్కెట్ జంక్షన్ వరకు 21 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు అంశాలు చర్చకు రానున్నాయి. ► పెదగదిలి జంక్షన్ వద్ద తూర్పు దిక్కున రూ.1.72కోట్లతో వంతెన నిర్మాణం, పడమర వైపున రూ.1.73 కోట్లతో వంతెన నిర్మాణం, కొత్త గాజువాక జంక్షన్ నుంచి వంటిల్లు జంక్షన్(కణితి రోడ్డు) వరకు 15వ ఆర్థిక సంఘం నిధులతో బీటీ హాట్ మిక్స్ రోడ్డు విస్తరణ, పునరుద్ధరణ పనులు, హైటెన్షన్ విద్యుత్ స్తంభాల మార్పుపై చర్చించనున్నారు. ► గుండాల జంక్షన్ వద్ద రూ.1,98,90,000తో జీ 2 తరహాలో జీవీఎంసీ గెస్ట్‌హౌస్ నిర్మాణం, పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు హాట్మిక్స్తో బీటీ రోడ్డు పునరుద్ధరణ, పీఎఫ్ కాలనీలో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 96వ వార్డు వేంకటేశ్వరస్వామి ఆలయ ఘాట్‌రోడ్డు హాట్మిక్స్తో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 95వ వార్డు పురుషోతపురం వద్ద గల మహతి స్కూల్ నుంచి కంఫర్ట్ హోమ్స్ వరకు బీటీ రోడ్డు తదితర అంశాలను చర్చించి ఆమోదించనున్నారు. ► 90, 91, 92 వార్డుల్లో గిరి ప్రదక్షిణ రోడ్డు విస్తరణ, సెంటర్ డివైడర్లు, ఆర్సీసీ డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణం, సమగ్ర మొబిలిటీ ప్లాన్ తయారీ, సీఎం ఈ–బస్ సేవా పథకం, మధురవాడ, పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు, గృహ అవసరాలకు 66 ఎంఎల్డీ నీటి సరఫరా, పంపిణీ, ముడసర్లోవలో నీటి శుద్ధి కర్మాగారం నిర్మాణంతో పాటు కేబీఆర్ నుంచి ట్రాన్స్మిషన్ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు షరతులతో కూడిన విస్కో ప్రాజెక్ట్స్ తదితర అంశాలపై సభ్యులు చర్చిస్తారు. -
ఆ సిండికేట్లదే పెత్తనం
- బినామీల పేరిట షాపులు - అధికార ప్రజాప్రతినిధి సిండికేట్‌దే హవా - స్లీపింగ్ పార్టనర్స్‌గా అధికార పార్టీ నేతలు - జీవీఎంసీ పరిధిలోని షాపులపైనే గురి సాక్షి, విశాఖపట్నం: ‘అధికారం’ చేతిలో ఉందని సిండికేట్లు రెచ్చిపోతున్నారు. మద్యం వ్యాపారంలో దశాబ్దాల అనుభవం ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే షాపుల పంపకాలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏడు సిండికేట్లు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని షాపులన్నీ గుప్పెట్లో పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి. జిల్లాలో 406 మద్యం షాపుల్లో 39 ప్రభుత్వం నిర్వహిస్తుంగా, మిగిలిన షాపులను 29న లాటరీలో కేటాయించనున్నారు. ఈసారి లీజు కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయించడంతో వ్యాపారులకు కలిసొస్తోంది. దీంతో వేలం పాటకు వ్యాపారులు పోటీపడుతున్నారు. నగర పరిధిలో ఏడు సిండికేట్లదే హవా. ఈ సిండికేట్ల గుప్పెట్లోనే మెజార్టీ షాపులున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన సిండికేట్ ఇన్నాళ్లూ నగర పరిధిలో ఉండే సిండికేట్లలో ఒకటిగా ఉండేది. ఎవరికి వారు చక్రం తిప్పుకుంటూ మెజార్టీ షాపులను దక్కించుకునేందుకు ఈ సిండికేట్లు పోటీపడేవి. కానీ ప్రస్తుతం అధికారం టీడీపీ చేతిలో ఉండడం. సదరు సిండికేట్ నాయకుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో ఈ రంగంలో పూర్తి పట్టు సాధించాలన్న పట్టుదలతో చక్రంతిప్పుతున్నారు. ఇతర సిండికేట్లు కూడా ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే షాపులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి తన సిండికేట్‌కు మెజార్టీ షాపులను దక్కించుకోవడంతో పాటు సిండికేట్లపై కూడా పూర్తి పట్టు సాధించేందుకునేందుకు పావులు కదుపుతున్నారు. సిటీ పరిధిలో 62 షాపులున్నాయి. పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, భీమిలి వంటి ప్రాంతాల పరిధిలో ఉన్న మరో 95 షాపులతో పాటు నగర పరిధిలో న్న 60 బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఈ సిండికేట్ల పరిధిలోనే ఉన్నాయి. ఈసారి వీటిని తిరిగి దక్కించుకోవడంతో పాటు మరిన్ని షాపులను ైకైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఒక్కొక్క సిండికేట్ గరిష్టంగా షాపులు, బార్లు కలిసి 25 నుంచి 30 వరకు దక్కించుకునేందుకు పథకరచన చేశాయి. బినామీల పేరిట ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు వేయిస్తున్నారు. కచ్చితంగా దక్కాల్సిన షాపుల కోసమైతే మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ షాపులకు దరఖాస్తులు ఎవరువేస్తున్నారో నిఘా పెట్టి వారికి నయానో.. భయానో తప్పుకునేలా చేస్తున్నారు. 62 షాపుల్లో 43 షాపులకు ఇప్పటి వరకు 106 దరఖాస్తులు రాగా, 53లక్షల లెసైన్సింగ్ ఫీజుగా వచ్చింది.