breaking news
Guduputani Movie
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న గూడుపుఠాణి, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సప్తగిరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం గూడుపుఠాణి. కె.యమ్. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. సప్తగిరి కామెడీ డైలాగులు, మంచి కథ కథనంతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. నిర్మాతలైన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లకు మంచి డబ్బు సంపాదించి పెటింది. ఇప్పుడు ఈ "గూడుపుఠాణి" చిత్రం జీ 5 ఓ టి టి లో రేపు అనగా 8 జులై నా విడుదల కానుంది. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లు మాట్లాడుతూ "మా గూడుపుఠాణి చిత్రం మంచి విజయం సాధించింది. థియేటర్ లో చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుందని కొనియాడాడు. మా చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. IMDB లో 8.8 రేటింగ్ వచ్చింది. మా చిత్రాన్ని జీ5 వాళ్ళు మంచి రేట్‌కు కొన్నారు. రేపు జీ5లో విడుదల అవుతుంది. థియేటర్లో మిస్ అయినా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు జీ 5లో లభిస్తుంది, చూసి ఆనందించండి" అని తెలిపారు. చదవండి: మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. పోక్సో చట్టం కింద నటుడు అరెస్ట్ నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే.. -
‘గూడుపుఠాణి ’ మూవీ రివ్యూ
టైటిల్: గూడుపుఠాణి నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచే తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ దర్శకత్వం: కెయమ్ కుమార్ సంగీతం: ప్రతాప్ విద్య విడుదల తేది: డిసెంబర్ 25, 2021 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హాస్య నటులు హీరోలుగా మారి సినిమాలు చేశారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్‌ని అందుకున్నారు. అలాంటి కమెడియన్స్‌లో సప్తగిరి ఒకరు. ఇప్పటికే సప్తగిరి ఎల్ ఎల్ బి, సప్తగిరి ఎక్సప్రెస్ లాంటి చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ యంగ్ కమెడియన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గూడుపుఠాణి ’.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు మూవీపై అంచనాలను పెంచింది. ఓ మోస్తారు అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సప్తగిరి తొలి చూపులోనే నేహా సొలంకి ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఓ పూరాతన అమ్మవారి దేవాలయంలో తమ వివాహాన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. అదే సమయంలో దేవాలయాల్లో వరుసగా అమ్మవారి నగలు దొంగిలించబడతాయి. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో సప్తగిరి పెళ్లి చేసకునే గుడిలో కూడా దొంగలు పడతారు. అసలు ఆ దొంగలు ఎవరు? ఆ గుడిలో ఏం జరిగింది? చివరకు సప్తగిరి, సొలంకిల పెళ్లి జరిగిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఎప్పటి మాదిరే సప్తగిరి మరోసారి తనదైన నటనతో అలరించాడు. తనదైన కామెడీతో నవ్విస్తూనే.. కొన్ని కీలక సన్నివేశాల్లో భయపెడతాడు. హీరోయిన్ నేహా సోలంకి అందం, అభినయంతో ఆకట్టుకుంది. విలన్‌గా రఘు కుంచె నటన సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలిసిన కథనే అద్భుతమైన కథనంతో మంచి ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కుమార్. సప్తగిరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. కామెడీతో పాటు మంచి కథ, కథనం, అద్భుతమైన డైలాగులు, అందమైన లొకేషన్స్‌తో పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించారు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ మాత్రం కాస్త బోరింగ్ అనిపిస్తాయి. అమ్మవారి నగలు దొంగిలించిది ఎవరనే విషయాన్ని చివరి వరకు చెప్పకుండా ప్రేక్షకులను క్యూరియాసిటీ కలిగించడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. ఇక సాకేతిక విషయాలకొస్తే.. ప్రతాప్ విద్య సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. మున్నా (ఫణి ప్రదీప్) మాటలు, పవన్ చెన్నా సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.