breaking news
GSLV Mark-3 experiment
-
జూన్ 5న జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల ఐదున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీన్ని ఇస్రో ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో షార్‌లోని రెండో ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న సాలిడ్ స్టేజ్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (ఎస్‌ఎస్‌ఏబీ) మూడు దశల రాకెట్ అనుసంధానాన్ని బుధవారం పూర్తి చేశారు. ఎస్‌ఎస్‌ఏబీ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదిక మీద అనుసంధానం చేసేందుకు వెహి కల్ మూమెంట్ కార్యక్రమాన్ని ఈ నెల 27న చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా 4.5 టన్నుల బరువు కలిగిన జీశాట్–19ను రోదసీలోకి పంపనున్నారు. ఇదిలా ఉండగా షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–38ను జూన్ 23న ప్రయోగించేందుకు ఇస్రో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పీఎస్ఎల్వీ రాకెట్‌లోని రెండో దశను అనుసంధానం చేసే ప్రక్రియను గురువారం పూర్తి చేశా రు. కాగా, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగం జూన్ 5న ముగియగానే ఎస్ఎస్ఏ బీలో పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్ క్యాంపైన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. తద్వారా జూన్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు 3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. -
2 నెలల్లో జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగం
కోల్‌కతా: అత్యంత శక్తివంతమైన ఉపగ్రహ వాహక నౌక జీఎస్ఎల్వీ మార్క్–3 ని మరో రెండు నెలల్లో ప్రయోగిస్తామని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ టీజీకే మూర్తి చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత గడ్డపై నుంచి 4 ఉపగ్రహాల్ని ప్రయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. కోల్‌కతాలో జరుగుతున్న ‘అడ్వాన్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ మూడు రోజుల సదస్సులో ప్రసంగిస్తూ... జీఎస్ఎల్వీ మార్క్–3 కోసం అధిక ఒత్తిడితో కూడిన క్రయోజెనిక్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించామని తెలిపారు. కాగా ఈ నెలలో ‘సార్క్’ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపుతుందని, సార్క్ సభ్య దేశాలకు ఆ ఉపగ్రహ ప్రయోజనాలు ఇవ్వాలని ప్రధాని ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఆయన చెప్పారు.