breaking news
grown up
-
మునగ చెట్లను గుబురుగా పెంచడం ఎలా?
► మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో – మునగ చెట్టును తప్పనిసరిగా పెంచుకోవాలి. ► తోటలో మునగ చెట్టు ఉంటే, ఒక కాయగూర – ఒక ఆకుకూర చెట్టు ఉన్నట్టు! ► కాయలనూ–ఆకునూ వినియోగించుకోవచ్చు. ► మునగ బహుళ ప్రయోజనకారి. సులభంగా పెరుగుతుంది. తొందరగా కాపునకు వస్తుంది. ► మునగ చెట్టును పెంచడంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. చెట్టును గుబురుగా పెంచాలి. ► ప్రతి అడుగు ఎత్తు పెరిగినప్పుడల్లా.. కొమ్మల చివరలను తుంచాలి. తుంచిన చోట, తిరిగి రెండు చివుళ్లు వస్తాయి. ► అలా ఎప్పుడూ చేస్తూ ఉండాలి! ► దానివల్ల చెట్టు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. ఆకు కోసి కూర వండుకోవచ్చు. లేనట్లయితే, చెట్టు నిటారుగా పెరుగుతుంది. విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ► చిన్న మొక్కల పూతను కూడా తుంచెయ్యాలి. లేకపోతే చెట్టు ఎదగదు! ► మొక్క నాటిన లేదా విత్తనం వేసిన తర్వాత కనీసం, ఆరేడు నెలలు పూతను తుంచెయ్యడంవల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. అలా ఎదిగాక పూతను ఉంచాలి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు f:/Tummeti Raghothama Reddy 1. మునగ మొక్క సన్నగా, నిటారుగా పెరుగుతుంటుంది. 2.3. కొమ్మల చివరలను, లేత మొక్కల పూతను తుంచుతూ ఉంటే.. ఎక్కువ కొమ్మలు వస్తాయి. 4. గుబురుగా పెరిగిన మునగ మొక్క నుంచి ఆకును కోసుకోవచ్చు. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పిల్లలు రేపు ఎలా ఉంటారో తెలిపే యాప్
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటారు ? తల్లి పోలికల్లో ఉంటారా? తండ్రి పోలికల్లో ఉంటారా? ఇద్దరిని కలగలిపిన పోలికల్లో ఉంటారా? అవకాశం ఉంటే తెలసుకోవాలనే కుతూహలం అందరు తల్లిదండ్రులకు ఉంటుంది. అలాంటి కుతూహలాన్ని తీర్చేందుకే బ్రాడ్ఫోర్డ్ యూనివర్సిటీలోని 'సెంటర్ ఫర్ విజువల్ కంప్యూటింగ్' విభాగం అధిపతి ప్రొఫెసర్ హసన్ ఉగేల్ ఓ విప్లవాత్మక యాప్‌ను సృష్టించారు. ఇప్పటికే ఈ యాప్‌ను ఉపయోగించి సెలబ్రిటీల పిల్లలైన యువరాజు ప్రిన్స్ జార్జ్, యువరాణి చార్లట్, హార్పర్ బెకమ్, ఎరిక్ కోవెల్లు రెండేళ్ల వయస్సులో ఎలా ఉంటారో, 20, 40, 60 ఏళ్లలో ఎలా ఉంటారో చిత్రీకరించారు. వాస్తవానికి ఈ యాప్‌ను జనసందోహంలో తిరిగే టెర్రరిస్టులను గుర్తించేందుకు సృష్టించారు. దానిపై వర్క్ చేస్తుంటే నేటి పిల్లలు రేపటి పౌరులుగా ఎలా ఉంటారో కంప్యూటర్ గ్రాఫిక్ ద్వారా సృష్టించవచ్చనే ఆలోచన ప్రొఫెసర్ ఉగేల్కు వచ్చింది. సెలబ్రిటీల ఫొటోలు వివిధ భంగిమల్లో విరివిగా దొరుకుతాయి కనుక ముందుగా తమ యాప్‌ను వారిపై ప్రయోగించాలని ఉగేల్ నిర్ణయించారు. ప్రిన్స్ జార్జ్, ప్రిన్స్ చార్లట్, హార్పర్ బెకమ్, ఎరిక్ కోవెల్ ఫొటోలను తీసుకొని యాప్ ద్వారా వాటికి వారి తల్లిదండ్రుల ముఖ కవళికలను జతచేసి వారు ఏ వయస్సులో ఎలా ఉంటారో చిత్రీకరించారు. ఏజింగ్ ప్రాసెస్‌లో సృష్టించిన ఈ ఫొటోలలో కచ్చితత్వం ఎంతో తెలుసుకోవడానికి ప్రొఫెసర్ ఉగేల్ మరో ప్రయోగం చేశారు. ప్రముఖ హాలీవుడ్ తార ఏంజెలినా జోలీ ప్రస్తుత ఫొటోలను తీసుకొని ఇదే యాప్‌ను ఉపయోగించి ఆమె వయస్సును వెనక్కి తీసుకెళ్తే (డీ ఏజింగ్) ఏ వయస్సులో ఎలా ఉండేదన్నది చిత్రీకరించారు. అదే వయస్సులో ఆమె దిగిన వాస్తవ ఫొటోలతో యాప్ ద్వారా చిత్రీకరించిన ఫొటోలను సరిచూశారు. 80 శాతం కచ్చితత్వం కనిపించింది. దాంతో నేటి పిల్లలు భవిష్యత్తులో ఎలా ఉంటారో తమ యాప్ ద్వారా 80 శాతం కచ్చితంగా చిత్రీకరించవచ్చని ప్రొఫెసర్ ఉగేల్ తెలిపారు. త్వరలోనే తమ ఈ సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు. సెల్ఫీలు దిగడం, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం ఫ్యాషన్ అయిన నేటి రోజుల్లో తమ యాప్ కచ్చితంగా ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.