breaking news
grope
-
మోదీ ఎదుటే మహిళా మంత్రికి లైంగిక వేధింపులు
అగర్తాల : మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటికి అంతమంటూ ఉండదు. పసికందులు నుంచి ముసలి వాళ్ల వరకూ.. బడికెళ్లే చిన్నారులు మొదలు, యువతులు, ఉద్యోగినులు, ఆఖరికి మహిళా మంత్రులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారంటే.. ఎలాంటి భయంకర పరిస్థితుల మధ్య బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఆడవారిని విలాస వస్తువుగా చూసే సమజాంలో ఎన్ని నిర్భయ చట్టాలు వస్తే మాత్రం ఏం లాభం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి త్రిపురలో చోటు చేసుకుంది. మదమెక్కి కొట్టుకుంటున్న ఓ మంత్రివర్యుడు.. తోటి మహిళా మంత్రిని అసభ్యకర రీతిలో తాకాడు. అది కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. అగర్తాలలో నిర్వహించిన ఓ ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఆహార మంత్రిత్వ శాఖ మినిస్టర్ మనోజ్ కంతి దేబ్‌తో పాటు.. త్రిపుర ఏకైకా మహిళా మంత్రి కూడా వెళ్లారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుండగా మనోజ్.. సదరు మహిళా మంత్రిని వెనక వైపు నుంచి అసభ్యకర రీతిలో తాకాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహిళా మంత్రి పట్ల మనోజ్ తీరును ఎండగడుతున్నాయి ప్రతిపక్షాలు. ‘ప్రధాని, ముఖ్యమంత్రి సమక్షంలో మనోజ్ ఓ మహిళా మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె గౌరవానికి భంగం కలిగించాడు. తక్షణమే అతన్ని పదవి నుంచి తొలగించి.. అరెస్ట్ చేయాల్సింది’గా డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ఈ విషయం గురించి మనోజ్‌ను వివరణ కోరగా అతడు స్పందించడానికి నిరాకరించాడు. Modi ji2,9,2019 ku tripura pucha oha Ek udgatan pe tripura ki #bjpneta ki halat dekiye #santanachakma minister social welfare bar bar inki kamar par hat dalte #manojkantideb minister of youth affairs ek minister honeki bad khud suraksit nahi@abhisar_sharma @dhruv_rathee pic.twitter.com/oc0x2F8Aj8 — Zakaria Ahmed (@zakariaahmed332) February 10, 2019 -
లిఫ్ట్‌లో చితక్కొట్టింది
రాత్రి 9.30 సమయంలో లిఫ్ట్ లో ఒంటరిగా ఉన్న యువతి. దీన్ని అదునుగా భావించి అసభ్యకరంగా ప్రవర్తించాడో యువకుడు. ముందు ఎంతగానో ఓపిక పట్టి తర్వాత ఆమె కోపానికి కుప్పకూలిపోయాడు ఆ ఆకతాయి. వివరాలు.. లిఫ్ట్‑ లో చైనాకు చెందిన యువతి ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఓ యువకుడు లిఫ్ట్ లో ప్రవేశించాడు. యువతి ఫోన్‌తో బిజీగా ఉన్నసమయంలో మొదట ఆమెకు దగ్గరగా వచ్చాడు. గమనించిన ఆమె ఏమీ అనకుండానే పక్కకు తప్పుకుంది. ఆ యువకుడు మరోసారి వెనక వైపుగా వచ్చి ఈ సారి ఏకంగా చేయిని యువతి భుజం పై వేశాడు. ఈ హఠాత్పరిణామంతో చిర్రెత్తుకొచ్చిన యువతి ఒక్క సెకన్ కూడా వేస్ట్ చేయకుండా ఆ కామాంధుడి చేయి తీసేసి, మోహంపై నుంచి ఒక్క గుద్దు గుద్దింది. అంతేనా చెప్పరాని చోట కాలుతో గట్టిగా ఓ తన్ను తన్ని అతను కిందికి వంగగానే మోహం పైనుంచి గట్టిగా కాలితో ఓ కిక్ ఇచ్చింది. అంతే ఆ యువకుడు లిఫ్ట్‑ లో కుప్పకూలిపోయాడు. ఈ నెల 24వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డయిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు .. సదరు యువతి దైర్యసాహసాలను కొనియాడుతున్నారు.