breaking news
The Great India Run
-
చీరతో మారథాన్
ఒకప్పటి సూపర్ మోడల్ మిలింద్ సోమన్ గత ఎనిమిది రోజులుగా చేస్తున్న ‘ది గ్రేట్ ఇండియన్ రన్’ నిన్నటితో పూర్తయింది! అహ్మదాబాద్లో బయల్దేరి రన్నింగ్ చేసుకుంటూ ఆయన ముంబై చేరుకున్నారు. గ్రేట్. కానీ అంతకంటే గ్రేట్.. మిలింద్ అమ్మగారు, 78 ఏళ్ల ఉషా సోమన్ అతడితో పాటు కలిసి కొంతదూరం పరుగెత్తడం! మార్గం మధ్యలో మహారాష్ట్రలోని మనోర్ దగ్గర కొడుకును కలుసుకున్న ఉష అతడితో కలిసి కాళ్లకు చెప్పుల్లేకుండా, చీరతో మారథాన్లాంటి రన్నింగ్ చేశారు. నిజానికి ఇది ఆమెకు కొత్త కాదు. గతంలో అనేకసార్లు 100 కిలోమీటర్ల రన్నింగ్లో పాల్గొన్నారు. ఇక మిలింద్కి ఇది మూడవ ‘అహ్మదాబాద్-ముంబై’ రన్. అహ్మదాబాద్ ముంబైల మధ్య దూరం 527 కి.మీ. -
కొడుకుతో కలిసి పరుగెత్తిన అమ్మ
అహ్మదాబాద్: వృద్ధాప్యంలో ఎవరైనా కృష్ణారామ అంటూ గడిపేస్తారు. ఆమె అందరిలా కాదు. 78 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ మరీ పరిగెత్తారు. తన కొడుకుతో కలిసి 'ది గ్రేట్ ఇండియన్ రన్'లో పాలు పంచుకున్నారు. ఆమె ఎవరో కాదు. భారత మాజీ సూపర్ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తల్లి ఉష. అహ్మదాబాద్ నుంచి ముంబైకి మిలింద్ చేపట్టిన 'ది గ్రేట్ ఇండియన్ రన్'లో కొడుకుతో కలిసి ఆమె కొంత దూరం పరిగెత్తారు. కాళ్లకు చెప్పులు, బూట్లు లేకుండా చీరకట్టుకుని మరీ ఆమె రన్ లో పాల్గొనడం విశేషం. మహారాష్ట్రలోని మనోర్ ప్రాంతంలో మిలింద్ తో కలిసి ఆమె పరుగెత్తారు. తల్లితో పరుగుపెడుతున్న వీడియోను మిలింద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 8 రోజుల్లోనే అతడు 'ది గ్రేట్ ఇండియన్ రన్' పూర్తి చేశాడు. పరుగు ద్వారా అహ్మదాబాద్ నుంచి ముంబైకి అతడు చేరుకోవడం ఇది మూడోసారి. కాళ్లకు జాగింగ్ బూట్లు గానీ, పాదరక్షలు గానీ లేకుండా అతడు పరుగెత్తాడు.