breaking news
Gravitational
-
ఐన్‌స్టీన్ సిద్ధాంతమే నిజం..!
వాషింగ్టన్: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతికూల సంద ర్భాల్లో కూడా నిజమేనని నిరూపితమైందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం బరువుతో సంబంధం లేకుండా విశ్వంలోని ఏ వస్తువైనా ఒకే సమయంలో కిందకు పడిపోతుంది. అయి తే ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే సిద్ధాంతా లు మాత్రం తక్కువ బరువున్న వాటితో పోలిస్తే.. అధిక గురుత్వాకర్షణ శక్తి ఉండే న్యూట్రాన్ స్టార్ కిందకు పడే సమయాల్లో తేడా లుంటాయని పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు ఐన్‌స్టీన్ సిద్ధాంతమే మరోసారి నిజమని నిరూపితమైనట్లు అమెరికాలోని గ్రీన్‌బ్యాంక్ అబ్జర్వేటరీ పరిశోధకులు చెప్పారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ భూమికి 4,200 కాంతి సంవత్సరా ల దూరంలో ఉన్న ట్రిపుల్ స్టార్ సిస్టమ్‌ను 2011లో కనుగొంది. ఈ వ్యవస్థలో న్యూట్రాన్ నక్షత్రం, రెండు మరుగుజ్జు నక్షత్రాలున్నాయి. ఈ న్యూట్రాన్ స్టార్ కన్నా లోపలి తెలుపు రంగు మరుగుజ్జు నక్షత్రం తక్కువ బరువుతో ఉంది. ఇతర పరిశోధకుల సిద్ధాంతా లే నిజమైతే.. న్యూట్రాన్ స్టార్, లోపలి తెలుపు రంగు నక్షత్రం వేర్వేరు సమయాల్లో కిందకు పడిపోవాల్సి ఉందని, కానీ అలా జరగలేదని చెప్పారు. -
రోదసిలో ఏడిస్తే.. ఇలా ఉంటుంది!
అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల మనుషులపై రకరకాల ప్రభావాలు పడుతుంటాయి. అందులో ఇదొకటి. మామూలుగా మనం భూమిపై ఏడిస్తే కన్నీళ్లు కిందికి రాలిపడతాయి. కానీ రోదసిలో ఏడిస్తే ఇలా ముఖం మీదే గడ్డకట్టుకుపోతాయి! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఏడుపుపై మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని కెనడియన్ వ్యోమగామి, ఐఎస్ఎస్ కమాండర్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ ఇలా ప్రదర్శించి చూపారు. ఈ రోదసి ఏడుపును వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ‘ఏడవమని ఒకరు ఆదేశిస్తే ఎలా ఏడుస్తాం చెప్పండి?’ అంటూ క్రిస్ కంట్లో నీళ్లు పోసుకుని ఇలా కన్నీటి పరీక్ష చూపించారు. సన్నటి ట్యూబ్ కలిగిన వాటర్ ప్యాకెట్ ద్వారా నీటిని కంట్లోకి చిమ్ముకోవడంతో ఇలా నీళ్లు కిందికి రాలకుండా కంటి దగ్గరే ఉండిపోయాయి!