breaking news
Grammys
-
Taylor Swift: గ్రామీ అవార్డుల్లో రికార్డు
అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా 2024 గ్రామీ అవార్డుల్లో మరోసారి తన సత్తా చాటింది. వరుసగా నాలుగో సారి బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెల్చుకుంది. తన మిడ్నైట్స్ ఆల్బమ్‌కు గాను ఈ అవార్డు దక్కింది. వరుసగా నాలుగు అవార్డులను దక్కించుకున్న తొలి మహిళా సింగర్ 66 ఏళ్ల గ్రామీ అవార్డు చరిత్రలోనే ఇది రికార్డు. ఇది తన జీవితంలో గొప్ప క్షణాలన్ని టేలర్ ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు "ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్మెంట్" అనే కొత్త ఆల్బమ్‌ను కూడా ఏప్రిల్ 19వ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇక ఎస్జెడ్ఏ ఆర్ అండ్ బి పాట కోసం ఎస్జెడ్ఏ అవార్డును దక్కించుకోవడంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంకా మోనెట్, బిల్లీ ఎలిష్, మైలీ సైరస్ వంటి మహిళా కేటగిరీలో నామినేషన్లలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. మూడుసార్లు బెస్ట్ ఆల్బమ్ గెలిచిన సింగర్లలో స్టీవ్ వండర్, పౌల్ సిమన్, ఫ్రాంక్ సినత్రాలు ఉండటం విశేషం.మైలీ సైరస్ ఎట్టకేలకు తొలి సారి గ్రామీ అవార్డును గెలుచుకుంది "ఫ్లవర్స్" అనే సాంగ్ ఉత్తమ పాప్ సోలో అవార్డు సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఎనిమిది సార్లు నామినేట్ అయింది. కానీ అదృష్టం వరించలేదు. కాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 66వ వార్షిక గ్రామీ అవార్డుల సందర్భంగా విక్టోరియా మోనెట్ ఉత్తమ నూతన కళాకారిణిగా అవార్డును స్వీకరించింది. Taylor Swift just took the album of the year trophy from Celine Dion without batting an eye and/or acknowledging that a legendary 🐐 was handing her the award. So cringey for my soul 🫠 pic.twitter.com/J7LggDVQD8— eazy e (@estefs) February 5, 2024 -
గ్రామీ సంగీతోత్సవం!
-
గ్రామీతో కట్టలు తెగిన ఆమె ఆనందం!
58వ గ్రామీ సంగీత పురస్కారాల ప్రదానోత్సవంలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ మళ్లీ తన సత్తా చాటింది. బెస్ట్ ఆల్బం కేటగిరిలో '1989' గీతానికి రెండోసారి గ్రామీ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో టైలర్ స్విఫ్ట్ ఆనంద డొలికల్లో తేలిపోతూ.. తన సంతోషాన్ని ఫేస్బుక్లో షేర్ చేసింది. సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈసారి కాలిఫోర్నియా ర్యాపర్ కెండ్రిక్ లామర్ పంట పండింది. ఆయన ఏకంగా ఐదు గ్రామీ పురస్కారాలతో తొలిస్థానంలో నిలిచాడు. మేఘన్ ట్రైనర్ బెస్ట్ న్యూ ఆర్టిస్ట్‌గా గ్రామీ గెలుచుకోగా, బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఎడ్ షెరాన్ పురస్కారాన్ని గెలుచుకుంది. 'అప్‌టౌన్ ఫంక్' ఆల్బంకుగాను మార్క్ రాన్సన్ బెస్ట్ రికార్డు అవార్డు అందుకున్నారు. లేడీ గాగా, అడెల్ వంటి ప్రముఖ పాప్ సింగర్స్ హై వోల్టేజీ సంగీత ప్రదర్శనలతో ఈ అవార్డుల వేడుక ఆద్యంతం ఉర్రూతలూగింది.