కుమార్తెను హత్యచేసి తండ్రి ఆత్మహత్య
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. పరువు కోసం కన్నకూతుర్ని హతమార్చి, అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్నాబాద్ మండలం గౌరవెల్లిలో కన్నతండ్రే... కుమార్తెను హత్య చేసి, ఆ విషయం అందరికీ తెలిసేసరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం షరీఫుద్దీన్ అనే వ్యక్తి కుమార్తె వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. అతనినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది
అయితే ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేని షరీఫుద్దీన్ కుమార్తెను హతమార్చాడు. అనంతరం భార్యతో కలసి ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కాగా పోలీసుల విచారణలో యువతిది ఆత్మహత్య కాదని తేలింది. దాంతో నిజం అందరికీ తెలిసిందని షరీఫుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు.