breaking news
gowahati
-
తల్లే హంతకురాలు.. కొడుకుని ముక్కలు ముక్కులుగా నరికి.. సూట్‌కేస్‌లో కుక్కి
గౌహతి: ఓ అమ్మ పేగు బంధాన్ని తెంచుకుంది. నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించిన ఆ తల్లి ప్రియుడి మోజులో పడి తన పదేళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా కడతేర్చింది. కఠినాత్ములను సైతం కంటతడి పెట్టించే ఈ ఘటన అస్సాం రాష్ట్రం గౌహతిలో చోటు చేసుకుంది.గౌహతికి చెందిన దీపాలి రాజ్బోంగ్షి ఓ క్లీనిక్‌లో విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమారుడు 10ఏళ్ల మృణ్మోయ్ బర్మన్ నవోదయ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో దీపాలి గౌహతి పోలీసుల్ని ఆశ్రయించింది. ట్యూషన్‌కు వెళ్లిన తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణం సమీపంలో అనుమానాస్పద సూట్‌కేస్ గురించి సమాచారం అందింది. స్క్రాప్ దుకాణం యజమాని ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసును తెరిచి చూశారు. అంతే సూట్‌కేస్ లోపల ముక్కులు, ముక్కులగా ఉన్న మానవ శరీర భాగాల్ని చూసి కంగుతిన్నారు. ఫోరెన్సిక్ టీంను సైతం కేసులో ఇన్వాల్వ్ చేశారు.ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో సూట్‌కేస్‌లో ఉన్నది బాలుడి శరీర భాగాలేనని నిర్ధారించారు. మరి బాలుడిని ఎవరు హత్య చేశారు? బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అనే దిశగా ఆరా తీశారు. ముందుగా బాలుడి కుటుంబంలో గొడవలే హత్యకు దారి తీశాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల్ని, బంధువుల్ని విచారించారు.అయితే విచారణలో తల్లి తీరుపై పోలీసులకు అనుమానం వేసింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. ఓ ప్రభుత్వ సంస్థలో తాత్కాలికంగా ప్యూన్‌గా పనిచేస్తున్న ప్రియుడు జ్యోతిర్మయి హలై కలిసి కుమారుడిని తల్లి దారుణంగా హత్య చేసిందని తేల్చారు.కొంతకాలం క్రితం దీపాలికి, జ్యోతిర్మయి హలైల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని దీపాలి నిశ్చయించుకుంది. రెండు నెలల క్రితం తన భర్తకు విడాకులిచ్చింది. ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉన్న కొడుకును కడతేర్చింది. చివరికి కటకటాలపాలైంది. -
యువకుడి వద్ద 3 కిలోల బంగారం!
గువహతి: అస్సాంలోని గువహతి రైల్వే స్టేషన్లో ఓ యువకుడి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. రోజువారి తనిఖీలు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు 19 ఏళ్ల యువకుడి వద్ద 3 కిలోల బంగారాన్ని గుర్తించారు. పట్టుబడిన యువకుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎమ్డీ సాదిద్ కమాల్ అని పోలీసులు వెల్లడించారు. మూడు కిలోల బంగారాన్ని 14 బిస్కెట్ల రూపంలో.. సరాయ్‌ఘాట్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తూ సాదిద్ పట్టుబడ్డాడు. బంగారం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాదిద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎప్రిల్ 4న గువహతి రైల్వే పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.