breaking news
govt vip
-
చర్చించడం వారికి ఇష్టం లేనట్టుంది
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ తీరు విచిత్రంగా ఉందని, సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడం చూస్తుంటే సభలో చర్చించడం వారికి ఇష్టం లేదని అర్థమవుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సమావేశాల్లో చర్చించడానికి కాంగ్రెస్ దగ్గర సబ్జెక్ట్ లేదన్నారు. సోమవారం మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఎన్ని రోజులైనా సభ జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ సభా సంప్రదాయలను పట్టించుకోవడం లేదన్నారు. -
జెండా పండగలోనూ రాజకీయమే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జెండా పండగలోనూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా.. జిల్లానుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సహా ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు జెండా ఎగురవేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సర్పంచ్‌లు బేఖాతర్ చేశారు. చిన్నబుచ్చుకున్న సుజాత జిల్లా కేంద్రంలో జెండాను ఆవిష్కరించే అవకాశం వరుసగా మూడో సంవత్సరం కూడా మంత్రి మాణిక్యాలరావుకే దక్కింది. దీంతో చిన్నబుచ్చుకున్న మరో మంత్రి పీతల సుజాత అనంతపురం వెళ్లి అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఏలూరు నగరానికి పక్కనే ఉండే విప్ చింతమనేని ప్రభాకర్ సైతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి కొద్దిసేపు ఈ కార్యక్రమంలో ఉండి వెళ్లిపోయారు. ఇప్పటికే మంత్రి మాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్ బాపిరాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నరసాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జెండా పండగ సాక్షిగా తారస్థాయికి చేరింది. కొత్తపల్లి సుబ్బారాయుడు రుస్తుంబాదలోని తన నివాసం నుంచి, ఎమ్మెల్యే రాయపేటలోని తన నివాసం నుంచి మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశారు. నాయకులు, కార్యకర్తలకు తమ తమ ఇళ్ల వద్ద విందు ఏర్పాటు చేశారు. సర్కారు ఉత్తర్వుల్ని లెక్కచేయని సర్పంచ్‌లు జెండా ఎగురవేసే అవకాశాన్ని సర్పంచ్‌లకు బదులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సర్పంచ్‌లు లెక్కచేయలేదు. ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ నీలపాల శ్రీనివాసరావును కాదని అధికార పార్టీ సర్పంచ్ దొప్పసాని రామసిద్ధిరాజు జెండా ఎగురవేశారు. కొయ్యలగూడెం, పొంగుటూరు, దిప్పకాయలపాడు, సీతంపేట, రాజవరం, బయ్యనగూడెం పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్‌లు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రతి హైస్కూల్ వద్ద జెడ్పీటీసీ సభ్యునిచే జాతీయజెండా ఎగురవేయించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా గుంపర్రు హైస్కూల్ నుంచి యలమంచిలి జెడ్పీటీసీ సభ్యుడు బోనం వెంకట నరసింహరావుకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఉంగుటూరులోఅంతర్గత ఒప్పందం ప్రకారం అక్కడి సర్పంచ్ గంటా శ్రీలక్ష్మి మూడేళ్ల అనంతరం పదవికి రాజీనామా చేయాల్సి ఉండగా, ఆమె అందుకు భిన్నంగా వ్యవహరించారు. సర్పంచ్ గంటా శ్రీలక్ష్మి జెండా ఎగురవేయాల్సి ఉండగా, ఉప సర్పంచ్ సంధి నాగలక్ష్మి ముందుగానే పంచాయతీ కార్యాలయానికి చేరుకుని జెండా ఆవిష్కరించారు. సర్పంచ్ శ్రీలక్ష్మిని సంధి నాగలక్ష్మి, మరికొంత మంది మహిళలు బయటకు గెంటేశారు. సర్పంచ్‌కు స్పల్పగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఒక దశలో పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ ధర్నాకు దిగారు. -
విప్‌ను ఢిల్లీకి ఆహ్వానించిన ఎమ్మార్పీఎస్ నేతలు
మందమర్రి : ఈ నెల 25న దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం తలపెట్టిన ప్రజాప్రతినిధుల ధర్నాకు హాజరు కావాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలును బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి అహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వల శరత్, అధికార ప్రతినిధి మంత్రి మల్లేష్ మాట్లాడుతూ వర్గీకరణే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వర్గీకరణను సమర్థిస్తూ చట్ట సభలో తీర్మానాన్ని చేసి న్యాయం చేయాలన్నారు. ముందుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అందోళన కార్యక్రమాల కరపత్రాన్ని విప్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వాటర్‌ఫిల్టర్ ప్రారంభించిన విప్ సునీత
రాజాపేట: మండలంలోని సోమారం గ్రామంలో స్వచ్చంధ సంస్థ ఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్‌ను ఆదివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునితరెడ్డి ప్రారంభించారు. అనంతరం వాటర్ ఫిల్టర్ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునితరెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షంచాలని అన్నారు. ప్రజల కోసం వాటర్ ఫిల్టర్ ఏర్పాటుచేసిన స్వచ్చంధ సంస్థ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. -
'సీఎం, స్పీకర్ నిమిత్తమాత్రులే'
విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆదేశం మేరకు అసెంబ్లీని సమావేశపరిచే అధికారం గవర్నర్దే అని ప్రభుత్వ విప్ అనిల్ స్పష్టం చేశారు. ఆ విషయంలో సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు నిమిత్తమాత్రులేని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... అసెంబ్లీలో తెలంగాణ బిల్లు అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పడు ప్రొరోగ్ పేరుతో రాజకీయాలు చేస్తు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన స్పీకర్ స్థానాన్ని రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయాల్లోకి లాగడం సరికాదని అనిల్ అభిప్రాయపడ్డారు.