ఈ నెల 25న దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం తలపెట్టిన ప్రజాప్రతినిధుల ధర్నాకు హాజరు కావాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలును బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి అహ్వానించారు.
విప్‌ను ఢిల్లీకి ఆహ్వానించిన ఎమ్మార్పీఎస్ నేతలు
Jul 20 2016 11:43 PM | Updated on Sep 4 2017 5:29 AM
మందమర్రి : ఈ నెల 25న దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం తలపెట్టిన ప్రజాప్రతినిధుల ధర్నాకు హాజరు కావాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలును బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి అహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వల శరత్, అధికార ప్రతినిధి మంత్రి మల్లేష్ మాట్లాడుతూ వర్గీకరణే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వర్గీకరణను సమర్థిస్తూ చట్ట సభలో తీర్మానాన్ని చేసి న్యాయం చేయాలన్నారు. ముందుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అందోళన కార్యక్రమాల కరపత్రాన్ని విప్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement