breaking news
Govt hospital problems
-
ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవంటూ చంద్రబాబు ప్రకటనలు
-
హుస్నాబాద్ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!
సాక్షి, హుస్నాబాద్: ‘‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యాభై పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో పెద్దాస్పత్రిగా మారింది. అయినా రోగులకు అరకొర సేవలే అందుతున్నాయి. ఇది హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి.’’ హుస్నాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసి నాలుగేళ్లు కావస్తొంది. ఆస్పత్రి కోసం భవనాన్ని సైతం నిర్మించారు. కానీ ఆస్పత్రిలో సౌకర్యాలులేవు. సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. దీంతో హుస్నాబాద్ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో కేవలం జ్వరం, దగ్గు సాధారణ జబ్బులకు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. ప్రతీరోజు 400 నుంచి 500 మంది వరకు అవుట్ పేషంట్లు వస్తుంటారు. వారికి అరకొర సేవలు అందుతుండటంతో చేసేదిలేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. హుస్నాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దాదాపు నాలుగేళ్ల క్రితం 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. అందుకు తగ్గట్లుగా అత్యాధునికంగా నూతనంగా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. ఆస్పత్రికి తగ్గట్లుగా సౌకర్యాలు, డాక్టర్లు లేరు. నేటికి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తీసుకురాకపోవడమే కాకుండా ఏలాంటి ఆపరేషన్లు చేయకుండా కేవలం జ్వరం, దగ్గు సాధారణ జబ్బులకు మాత్రమే పరీక్షలు చేస్తూ, విషమంగా ఉంటే పట్టణాలకు రెఫర్ చేస్తున్నారు. డివిజన్ కేంద్రంగా ఉన్న ఈ ఆస్పత్రిలో ప్రతీ రోజు 400 నుంచి 500 మంది వరకు అవుట్ పేషంట్లు వస్తుంటారు. డీఎంఅండ్హెచ్ పరిధిలో రెగ్యులర్ డాక్టర్ సౌమ్య, మరో ఇద్దరు కాంట్రాక్ట్ బేసిక్ కింద డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గైనకాలజిస్ట్ లేక గర్భిణుల అవస్థలు ముఖ్యంగా గర్భిణులకు సాధారణ ప్రసవాలు తప్పితే మేజర్ సమస్యలు వస్తే, ఆ కేసులను ఇతర ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు గైనకాలజిస్ట్ డాక్టర్లు రాగా, వీరు ముగ్గురు రిజైన్ చేసి వెళ్లిపోవడంతో ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నప్పుడు ప్రసవాలు అధికంగా నమోదు అయ్యాయి. పరీక్షలకే పరిమితమవుతున్న డాక్టర్లు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారికి ప్రధమ చికిత్సతో పాటు గాయమైన చోట పట్టి కట్టాల్సి ఉంటుంది. నాలుగు వార్డు బాయ్ పోస్టులు ఖాళీగా ఉండటంతో స్వీపర్లే ప్రథమ చికిత్స అందిస్తూ కాలు, చేయికి పట్టికడుతారు. ఆస్పత్రిలో ఐదుగురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్లు ఇద్దరు, అనస్తీషియా ఒకరు, చిల్ట్రన్ స్పెషలిస్టు ఒకరు, డెంటిస్ట్ డాక్టర్ ఒకరు వైద్య విధాన పరిషత్ ద్వారా ఈ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్‌కు సంబంధించిన కనీసం ఫిజియో«ధెరపి చేసే పరికరాలు లేవు. ఏ శస్ట్ర చికిత్స చేద్దామన్న అందుకు తగ్గ పరికరాలు లేవు. దీంతో డాక్టర్లు కేవలం పరీక్షలు మాత్రమే చేస్తూ మందులు మాత్రమే ఇస్తున్నారు. నిరుపయోగంగా ఎక్స్‌రే ప్లాంట్ హుస్నాబాద్ ఆస్పత్రిలో ఎక్స్‌రేప్లాంట్ అలంకారప్రాయంగా దర్శనమిస్తుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో ఎక్స్‌రే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పుడు సైతం రేడియో గ్రాఫర్ లేకపోవడం, దానిని వినియోగంలోకి తీసుకురాకలేకపోవడంతో ఎక్స్‌రే ప్లాంట్ పని చేయకుండా పోయింది. ఈ ప్లాంట్‌ను ఇనుప సామానుకిందనే పడేశారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశాక కొత్త ఎక్స్‌రే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు రేడియోగ్రాఫర్ ఎవరు రాకపోవడంతో నిరుపయోగంగానే ఉంది. అధికారులకు నివేదిక ఇచ్చాం.. ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 400 మంది రోగులకు పైగా అవుట్ పేషంట్లకు వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య విధాన పరిషత్‌లోకి ఆస్పత్రిని చేరుస్తామని చెబుతున్నారు. దీంతో ఆపరేషన్లతో పాటుగా పూర్తి స్థాయిలో సదుపాయాలు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి. వైద్య విధానపరిషత్ ద్వారా ఐదు గురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్స్‌రే ప్లాంట్ నిర్వాహణకు రేడియోగ్రాఫర్ అవసరముంది. ఈ విషయాల పై ఉన్నతాధికారులకు నివేధికను అందించాం. – డాక్టర్ సౌమ్య, ప్రభుత్వ వైద్యురాలు, హుస్నాబాద్ -
హా..స్పత్రి
- ప్రభుత్వాస్పత్రిలో అన్నీ సమస్యలే.. - ఒక బెడ్‌పై ఇద్దరు గర్భిణులు - ఎక్స్‌రే తీసే వారే లేరు.. - భయంకరంగా ఎమర్జెన్సీ వార్డు - గుండెనొప్పి వస్తే గుంటూరుకే.. లబ్బీపేట : జిల్లాలోని 45లక్షల మంది జనాభాకు ఆరోగ్య భరోసా ఇస్తూ పెద్దదిక్కుగా నిలవాల్సిన ప్రభుత్వాస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుంది. పేరుకు పెద్దాస్పత్రే కానీ, సౌకర్యాల్లో మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలా ఉందని సీనియర్ వైద్యులే చెబుతున్నారు. మూడు దశాబ్దాల కిందట 412 పడకలతో ప్రభుత్వాస్పత్రి ఏర్పాటు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 750కి చేరింది. అయితే, అందుకు తగ్గట్టుగా సిబ్బందిని పెంచకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. గతంలో ఉన్న సిబ్బంది పదవీ విరమణ చేస్తుండగా, వారి స్థానంలో కొత్తవారిని తీసుకోకపోవడంతో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో రోగులను స్ట్రెచ్చర్‌పై తీసుకెళ్లే వారు లేక బంధువులే ఆ పనిచేస్తున్నారు. రేడియో గ్రాఫర్ల కొరతతో ఎక్స్‌రే తీయించుకునేందుకు రెండు గంటల పాటు వేచి ఉండాల్సిన దుస్థితి. ఇంకోవైపు వైద్యుల కొరత వేధిస్తుండగా, సౌకర్యాలు సైతం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది. క్యాజువాలిటీలో సౌకర్యాలేవి? ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారికి సకాలంలో చికిత్స అందించాల్సిన అత్యవసర చికిత్సా విభాగంలో సరైన సౌకర్యాలు లేవు. వెంటిలేటర్‌తో పాటు పారా మీటర్స్, పల్స్ ఆక్సీ మీటర్స్ అందుబాటులో ఉండాలి. గాయాలతో వచ్చిన రోగికి అక్కడే ఎక్స్‌రే తీసే సదుపాయం, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటివి సిద్ధంగా ఉంచాలి. కానీ, ఇక్కడ అలాంటి సౌకర్యాలేమీ లేవు. పరికరాలు ఉన్నా పనిచేయవు. ఒక్కో సమయంలో ప్రాణాపాయంలో వచ్చిన రోగికి ఈసీజీ తీసేందుకు కూడా టెక్నీషియన్ అందుబాటులో ఉండడు. గుండెనొప్పి వస్తే గుంటూరుకే.. మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వాస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఏర్పాటైనా కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఒక్క ఈసీజీ, డాప్లర్ ఎకో మినహా ఇతర పరీక్షలేమీ అందుబాటులో లేని పరిస్థితి. గుండె లోపాలు గుర్తించడంలో క్యాథ్‌ల్యాబ్ కీలకమైన పరికరం. అది అందుబాటులో లేకపోవడంతో గుండె వైద్యులెవరూ ఇక్కడ పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. కార్డియాలజీ విభాగంలో ఒక్క వైద్యుడు కూడా లేడు. దీంతో గుండెనొప్పితో వచ్చిన వారిని గుంటూరు ఆస్పత్రికి పంపుతున్నారు. ప్రసూతి విభాగంలో అన్నీ సమస్యలే.. ప్రసూతి విభాగంలో పడకల కొరత తీవ్రంగా ఉంది. పురిటి నొప్పులతో వచ్చిన వారికి కేటాయించేందుకు పడకలు లేకపోవడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరిని ఉంచుతున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. ఈ విభాగానికి గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి కూడా గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. ప్రస్తుతం 90 పడకలు ఉండగా, మరో 90 అవసరం ఉందని అధికారులు ప్రభుత్వాస్పత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ మెటర్నరీ అసిస్టెంట్‌గా కొరత కూడా ఉంది. ప్రభుత్వానికి విన్నవించాం.. ప్రభుత్వాస్పత్రిలో రేడియోగ్రాఫర్ల కొరత విషయమై అనేకసార్లు ప్రభుత్వానికి రాశాం. ఆరోగ్యశ్రీలో కొందరిని అవుట్‌సోర్సింగ్‌లో నియమించాం. సీటీ టెక్నీషియన్స్ కూడా అలాగే నియమించాం. ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోల కొరత ఉంది. కొత్తవారిని నియమించుకునే అవకాశం లేకపోవడంతో ఉన్న సిబ్బందితోనే రోగులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. - డాక్టర్ యు.సూర్యకుమారి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్