breaking news
Govind Padma surya
-
'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో వీళ్ల ప్రేమ పెళ్లా, పెద్దల కుదిర్చిన సంబంధమా అని తెగ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్‌తో సహా మొత్తం!) మలయాళ నటుడు పద్మ సూర్య.. సొంత ఇండస్ట్రీలో హీరోగా ఫేమ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో 'అల వైకుంఠపురములో' చిత్రంలో విలన్ కొడుకుగా నటించాడు. ఇది కాకుండా బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. మరోవైపు టీవీ షోల హోస్ట్‌గానూ రాణిస్తున్నాడు. నటుడిగా పేరు తెచ్చుకున్న పద్మసూర్య.. సీరియల్ బ్యూటీ గోపిక అనిల్‌తో నిశ్తితార్థం చేసుకున్నాడు. అయితే వీళ్లది పెద్దల కుదుర్చిన సంబంధమని స్వయంగా పద్మసూర్యనే సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇకపోతే జంట చూడచక్కగా ఉందని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే డిసెంబరులో వీళ్ల పెళ్లి ఉండొచ్చని అంటున్నారు. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) View this post on Instagram A post shared by Govind Padmasoorya (GP) (@padmasoorya) -
ఏం జరుగుతోంది..!
పుకార్ల ‘షి’కార్లో... లైమ్‌లైట్‌లో ఉండే ట్రిక్సో.. మొత్తానికి సెక్సీ సుందరి ప్రియమణి ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. లేటెస్ట్గా ఈ అమ్మడు.. భూటాన్ నటుడు కెల్లీ డోర్జీతో ‘క్లోజ్’అప్‌గా ఉన్న ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇంకేముంది... సహ నటుడు గోవింద్ పద్మసూర్యతో ఇప్పటి వరకూ నడిచిన అఫైర్‌కు బ్రేక్ పడినట్టేనని శాండల్‌వుడ్‌లో ప్రచారం సాగుతోంది. పైగా... ఈ మధ్య పద్మసూర్యతో ఈ అమ్మడు కలసి ఉన్న పిక్చరేదీ కనిపించకపోవడంతో... కెల్లీతో కథేదో నడుస్తోందని కథలు అల్లేస్తోంది.