breaking news
government budget
-
మిగిలిన రుణమాఫీ నిధులు వెనక్కు
ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ప్రక్రియ త్వరలో నాలుగో విడత రుణమాఫీ జాబితా వీడియో కాన్ఫరెన్స్లోరైతుసాధికార సంస్థ సీఈఓ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): రుణమాఫీకి సంబంధించి మిగులు నిధులను వెనక్కు పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని రాష్ట్ర రైతు సాధికార సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి ముధుసూదన్రావు తెలిపారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బ్యాంక్లర్లతో సమీక్ష నిర్వహించారు. మెదటి విడతలో రుణమాఫి కింద విడుదల చేసిన నిధుల్లో వివిధ కారణాల వల్ల కొంత మొత్తం మిగిలిందన్నారు. వీటిని వెనక్కి పంపేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించామన్నారు. మిగిలిన నిధులు రైతుసాధికార సంస్థకు చేరిన తర్వాత రుణమాఫీకి సంబంధించి నాలుగవ విడత జాబితా ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రెండవ విడత నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా ఇచ్చిందన్నారు. కర్నూలు నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో ఎల్‌డీసీఎం నరసింహారావు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు చేయూత ఏదీ ?
బడ్జెట్ కేటాయింపుల నిధుల విడుదలలో జాప్యం హామీలే గానీ చేతల్లో కొరవడిన సహకారం చిలకపూడి (మచిలీపట్నం) : నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేయూతనిచ్చే అంశం ప్రహసనంగా మారింది. వారి సంక్షేమానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు కాగితాలకే పరిమితమవుతోంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాలకపక్ష ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారని, వాటి అమలు విషయంలో వారినుంచి సహకారం కొరవడుతోందని పలువురు వాపోతున్నారు. 2013- 14 ఆర్థిక సంవత్సరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉపాధి అవకాశాలు కల్పిం చేం దుకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టి 15 నెలలు కావస్తున్నా నిధులు నేటికీ విడుదల కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. తా ము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని ప్రస్తుత అధికార పార్టీ నేతలు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన విష యం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విధంగా ఆలోచన చేయకపోగా.. సంక్షేమ పథకాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు విడుదల చేయించడంలో కూడా సహకారం అందించటం లేదని నిరుద్యోగ యువత వాపోతున్నారు. 2013 నుంచి ఎదురు చూపులు 2013 జూన్ నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు జారీ చేయటంతో అర్హులైన వారు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం బ్యాంకుల అధికారుల నుంచి హామీ పత్రాలను పొంది, దరఖాస్తులతోపాటు సమర్పించారు. వీటితో పాటు ఆయా కార్పొరేషన్లకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును కూడా అందజేశారు. నిధుల విడుదల గురించి సం బంధిత అధికారులను ప్రశ్నిస్తే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖా తాలను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడదీయాల్సి ఉందని కుంటిసాకులు చెబుతున్నారని యువత ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు తమకు నిధులు మంజూరవుతాయా? లేదా? అనే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. లబ్ధిదారుల వివరాలు.. ఎస్సీ సొసైటీ ద్వారా 3,567, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ద్వారా 4,398, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 822, వికలాంగ సంక్షేమశాఖ ద్వారా 51 యూనిట్లు మంజూరు చేయడానికి నిర్ణయించారు. వీటిలో మొత్తం 5,307 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు. అ యితే 2013-14 ఆర్థిక సంవత్సరానికి బీసీ సొసైటీ ఆధ్వర్యంలో మొత్తం 1782 మంది లబ్ధిదారులకు రూ. 6.37 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి ముందు 851 మంది లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో ఉంచారు. ప్రవర్తనా నియమావళి అమలులోకి రావటంతో ఆన్లైన్ నిలుపుదల చేశారు. 542 మం ది ఖాతాల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అ యితే ఇంకా 389 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు, ఇతర ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉందన్నారు. ఎస్సీ సొసైటీ ద్వారా 3,500 యూనిట్ల మంజూరుకు బడ్జెట్లో మొత్తం రూ. 39.46 కోట్ల కేటాయింపు జరిగింది. వీటిలో 3,816 యూనిట్ల మంజూరుకు అనుమతి ఇవ్వటంతో బ్యాంకింగ్ ప్లాన్ కింద 3,710, నాన్ బ్యాకింగ్ ప్లాన్ కింద 106 యూనిట్లు కేటాయించి, రూ. 33.34 కోట్లు చెల్లించడానికి ప్ర ణాళిక రూపొందించారు. గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి మొత్తం 822 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయిం చగా, 346 యూనిట్లు మాత్రమే మం జూరు చేశారు. వికలాంగుల సంక్షేమశాఖకు సంబంధించి 51 యూనిట్లు మంజూరు చేయాల్సి ఉం డగా, 21 యూనిట్లు మాత్రమే మంజూరు చేశా రు. ఈ లబ్ధిదారులకు ఆయా శాఖల్లో కేటాయింపులు, నిధుల విడుదలలో భారీ వ్య త్యా సం ఉండటంతో రుణాలు మంజూరవుతా యా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా నిరుద్యోగ యువతకు ఎంత మేర చేయూత అందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.