breaking news
Government Agreement
-
బోడో సంస్థలతో కేంద్రం ఒప్పందం
న్యూఢిల్లీ: గత కొన్ని దశాబ్దాలుగా అస్సాంలో ప్రత్యేక బోడోలాండ్ కోసం పోరాడుతున్న ప్రత్యేక బోడో ఉద్యమ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. అస్సాంలో ప్రధాన తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డీఎఫ్బీ), ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్‌యూ)లతో ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఒప్పందంపై సంతకాలు చేసినవారిలో యునైటెడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, ఎన్డీఎఫ్బీ, ఏబీఎస్‌యూ నాయకులు, హోంశాఖ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్, అస్సాం చీఫ్ సెక్రటరీ కుమార్ సంజయ్ క్రిష్ణ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. సుదీర్ఘకా లంగా పోరాడుతున్న బోడో ప్రజల సమస్యకు పరిష్కారం చూపే ‘చారిత్రక’ ఒప్పందంగా దీన్ని అభివర్ణించారు. ‘ఈ ఒప్పందం బోడో ప్రాంత ప్రజల సమగ్రాభివృద్ధికోసం కృషిచేస్తుంది. వారి భాష, సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తుం ది’ అని అన్నారు. బోడో తీవ్రవాదుల హింసాకాం డ కారణంగా గడిచిన దశాబ్దాల్లో 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అమిత్‌షా చెప్పారు. ఒప్పందం తర్వాత అస్సాంలోని ప్రజలు సామరస్యంతో జీవిస్తారన్న ఆశాభావాన్ని అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్ వ్యక్తం చేశారు. ఎన్డీఎఫ్బీకి చెందిన 1,550 మంది మిలిటెంట్లు లొంగిపోయినట్టు అస్సాం మంత్రి హేమంత్ బిశ్వ శర్మ చెప్పారు. వచ్చే మూడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 750 కోట్ల చొప్పున రూ.1,500 కోట్లతో ఒక ఆర్థిక పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. బోడో తీవ్రవాద సంస్థలు ఈ ఒప్పందంతో జనజీవన స్రవంతిలోకి వస్తాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 27 ఏళ్లలో మూడోసారి.. ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం హింసాత్మకంగా మారి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే గత 27 ఏళ్ళలో ఇలా ఒప్పందంపై సంతకాలు చేయడం ఇది మూడోసారి. పరిమిత రాజకీయా«ధి కారాలతో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్‌తో 1993లో తొలిసారి ఇలాంటి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్‌కి దారితీసింది. రెండో ఒప్పందం బోడో లిబరేషన్ టైగర్స్ తీవ్రవాద గ్రూప్‌తో 2003లో జరిగింది. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీసీ)కి దారితీసింది. అస్సాంలోని నాలుగు జిల్లాలు కొక్రాఝార్, చిరంగ్, బాస్కా, ఉదల్‌గిరి కలిపి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ట్(బీటీఏడీ) ఏర్పాటైంది. తర్వాత బీటీసీని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌గా మార్చారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఆధారంగా బీటీసీని ఏర్పాటు చేశారు. -
నో బీ(ధీ)మా
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : మేత కోసం బయటికి వదిలిన పశువులు సాయంత్రం వరకు ఇంటి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఏ కరెంటు తీగనో.. ఏ అటవీ జంతువో వాటి పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఫలితంగా రైతులకు తీరని నష్టం మిగులుతోంది. పశువులకు బీమా సౌకర్యం లేక ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో చేసుకున్న గడువు ముగియడం.. ఏడు నెలలకు పైగా గడుస్తున్నా ప్రీమియం సౌకర్యం లేకపోవడంతో చనిపోయిన మూగజీవాలకు పరిహారం దక్కడం లేదు. ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ గడువు కాస్త మార్చితో ముగిసింది. పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1,09,175 ఆవులు, ఎడ్లు, 3,36,654 పాడిగేదెలు, 6,95,110 గొర్రెలు, 5,88,303 మేకలు ఉన్నాయి. జిల్లాలో విద్యుత్ఘాతంతో, రోడ్డు ప్రమాదంలో, ఇతరత్రా కారణాలతో రోజుకు 2 నుంచి 5 వరకు ఏదో రకంగా ప్రమాదంలో మూగజీవాలు మృతిచెందుతూనే ఉన్నాయి. ఆరు నెలల్లో 230 వరకు పశువులు బలి అయ్యాయి. రెండు నెలల క్రితం భైంసా, కడెం మండల పరిధిలో ఐదు పశువులు మృతిచెందాయి. ఈ నేపథ్యంలో బీమా చెల్లింపు గడువు ముగియడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మరికొందరికేమో అసలు బీమా సౌకర్యం గురించి అవగాహన లేకుండాపోయింది. గతేడాది న్యూఇండియా బీమా కంపెనీ వద్ద 1210 పశువులకు మాత్రమే బీమా చేయించారు. ఈ బీమా ఒక్క ఏడాదికి మాత్రమే రైతులు ప్రీమియం చెల్లించారు. దాంతో మృతిచెందిన 17 పశువులకు పరిహారం అందింది. ఈ ఏడాది ఇంతవరకు బీమా కంపెనీ ప్రభుత్వంతో కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇప్పటికే బీమా సౌకర్యం కోల్పోయి ఏడు నెలలకు పైగా అవుతోంది. ఏటా అవగాహన కరువు.. జిల్లాలో 52 మండలాలకు గాను 101 పశుైవె ద్యశాలలు ఉన్నాయి. గ్రామాల్లోని చాలా మంది రైతులకు, పెంపకం దారులకు పశువుల బీమా సౌకర్యం అందుబాటులో ఉన్న విషయమే తెలీదు. గ్రామాల్లో పశుమిత్రలు, గోపాలమిత్రలు పనిచేస్తున్నా అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. బీమా సంస్థలు చొరవ తీసుకోకపోవడం.. బీమా పరిహారం చెల్లింపుల్లో జాప్యంతో రైతులు కూడా ముందుకు రావడం లేదు. బీమా సౌకర్యం ఇలా.. పశువులకు బీమా చేయించే రైతులు 50 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగితా 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది. పాడి గేదెలు, ఆవులు, గేదేలు, మేకలు, గొర్రెలకు బీమా చేయించుకోవచ్చు. రూ.10 వేల విలువైన పశువుకు బీమా ఏడాదికి రూ.202.67 పైసలు, ప్రభుత్వం రూ.202.67 పైసలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి మూడేళ్లకు బీమా చేయించే అవకాశం కూడా మూడేళ్లకు కలిపి రూ.516 చెల్లించాల్సి ఉంటుంది. పశువు బీమా చేయాలనుకుంటే మండల పశు వైద్యాధికారులను, పశుమిత్రలను, గోపాలమిత్రలను సంప్రదించాలి. వారు బీమా కంపెనీల వివరాలు ఇస్తారు. బీమా చేయించిన పశువు చెవికి ట్యాగ్ వేస్తారు. అది ఉంటేనే బీమా వర్తిస్తుంది. బీమా చేయించిన పశువును అమ్ముకోవాల్సి వస్తే పశు వైద్యాధికారికి సమాచారం అందించి ధ్రువీకరణ పత్రం పొంది బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. అప్పుడు రూ.100 చెల్లించి కొనుగోలు చేసిన రైతు పేర మార్చుకోవచ్చు. పశువులు, జీవాలు ప్రమాదవశాత్తు మృతిచెందినా.. ప్రకృతి వైపరీత్యాలతో.. వ్యాధులతో మరణించినా పెంపకం దారులకు పరిహారం అందుతుంది. ప్రమాదవశాత్తు మరణించిన రైతుకు కూడా రూ.50 వేల వరకు బీమా మొత్తం లభిస్తుంది. దీని కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. నాలుగేళ్లలో బీమా చేసిన పశువులు.. అందిన పరిహారం సంవత్సరం పశువులు పరిహారం 2010-2011 1,115 15 2011-2012 1,047 13 2012-2013 6,75 18 2013-2014 1,210 17