breaking news
Gordon
-
ప్రపంచకప్ బరిలో స్కాట్లాండ్ గోల్‌కీపర్ క్రెయిగ్ గోర్డాన్
గ్లాస్గో: ఆటకు వీడ్కోలు చెప్పకముందే తన కల నిజం చేసుకోబోతున్నాడు స్కాట్లాండ్కు చెందిన 43 ఏళ్ల క్రెయిగ్ గోర్డాన్. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోరీ్నకి అర్హత సాధించిన స్కాట్లాండ్ జట్టు తరఫున గోర్డాన్ బరిలోకి దిగనున్నాడు. వచ్చే నెలలో అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌లో పోటీపడే స్కాట్లాండ్ జట్టును మంగళవారం ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన స్కాట్లాండ్ జట్టులో క్రెయిగ్ గోర్డాన్కు కూడా స్థానం లభించింది. 2004లోనే గోర్డాన్ స్కాట్లాండ్ జాతీయ సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేయగా... ప్రస్తుత జట్టులోని చాలామంది ప్లేయర్లు అప్పటికింకా పుట్టనే లేదు. గ్రూప్ ‘సి’లో ఉన్న సాట్లాండ్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న బోస్టన్‌లో హైతీ జట్టుతో ఆడుతుంది. గోర్డాన్ తుది జట్టులో ఆడితే ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన రెండో అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందుతాడు. ప్రపంచకప్ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు ఈజిప్ట్ గోల్‌కీపర్ ఎసామ్ ఎల్ హదారీ (2018లో 45 ఏళ్లు) పేరిట ఉంది. -
పదేళ్లుగా టచ్ చేయకుండా పోర్న్ చూశాడని..
లాంక్ షైర్: పోర్న్ వీడియోలు చూస్తున్నాడనే ఆగ్రహంతో తన వృద్ధ భర్తను ఓ వృద్ధురాలైన భార్య కొట్టి చంపింది. ఆమె స్వయంగా ఈ హత్యను చేసినట్లు అంగీకరించింది. లాంక్ షైర్లోని ఓస్వాల్డ్ విజిల్లో లిండా హోమ్స్(70), గోర్డాన్(78) అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి వివాహం అయ్యి కూడా దాదాపు 50 ఏళ్లు దాటింది. ఆమె ఒకసారి బయటకు వెళ్లి తిరిగి రాగా అతడు ఇంట్లో అశ్లీల చిత్రాలు చూస్తూ కనిపించాడు. ఆమె అడిగితే తాను చూడలేదని బుకాయించాడు. దీంతో వెంటనే చికెన్ లాంటి దాన్ని నుజ్జునుజ్జు చేసే సుత్తెలాంటి దాన్ని తీసుకొని పదేపదే అతడి తలపై కొట్టడంతో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఆమె వివరణ ఇస్తూ 'అతడు పోర్న్ వీడియోలు చూస్తుండగా పట్టుకున్నాను. కానీ, ఆ విషయం నుంచి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. నాకు తీవ్ర కోపం వచ్చింది. చంపేయాలనుకున్నాను. తీవ్రంగా కొట్టాను. నేను చేసేది ఓ హత్యలాగా ఉండాలని భావించాను. గడిచిన పదేళ్లలో అతడు నన్ను ఒక్కసారి కూడా తాకలేదు. కానీ, పోర్న్ మాత్రం చూస్తున్నాడు. అతడికి ఎంత ధైర్యం. నా పదేళ్ల జీవితంలోకి నేను తిరిగి ఎలా వెళ్లగలను? అని ఆమె చెప్పింది. అతడి ప్రవర్తన చూసి మానసిక ఆందోళనకు లోనయ్యే తాను ఈ హత్య చేసినట్లు చెప్పింది. పదిహనేళ్ల వయసులో ఒకరినొకరు కలిసిన వీరిద్దరు ఐదేళ్లు గడిచిన తర్వాత భార్యాభర్తలుగా జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమతో మొదలైన వీరి జీవితం చరమాంకంలో మాత్రం విషాదంగా మిగిలింది.


