ప్రపంచకప్‌ బరిలో స్కాట్లాండ్‌ గోల్‌కీపర్‌ క్రెయిగ్‌ గోర్డాన్‌ | Scotland includes 43-year-old goalkeeper Craig Gordon in World Cup squad | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ బరిలో స్కాట్లాండ్‌ గోల్‌కీపర్‌ క్రెయిగ్‌ గోర్డాన్‌

May 20 2026 9:03 AM | Updated on May 20 2026 11:31 AM

Scotland includes 43-year-old goalkeeper Craig Gordon in World Cup squad

గ్లాస్గో: ఆటకు వీడ్కోలు చెప్పకముందే తన కల నిజం చేసుకోబోతున్నాడు స్కాట్లాండ్‌కు చెందిన 43 ఏళ్ల క్రెయిగ్‌ గోర్డాన్‌. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోరీ్నకి అర్హత సాధించిన స్కాట్లాండ్‌ జట్టు తరఫున గోర్డాన్‌ బరిలోకి దిగనున్నాడు. వచ్చే నెలలో అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌లో పోటీపడే స్కాట్లాండ్‌ జట్టును మంగళవారం ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన స్కాట్లాండ్‌ జట్టులో క్రెయిగ్‌ గోర్డాన్‌కు కూడా స్థానం లభించింది.

 2004లోనే గోర్డాన్‌ స్కాట్లాండ్‌ జాతీయ సీనియర్‌ జట్టు తరఫున అరంగేట్రం చేయగా... ప్రస్తుత జట్టులోని చాలామంది ప్లేయర్లు అప్పటికింకా పుట్టనే లేదు. గ్రూప్‌ ‘సి’లో ఉన్న సాట్లాండ్‌ తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 14న బోస్టన్‌లో హైతీ జట్టుతో ఆడుతుంది. గోర్డాన్‌ తుది జట్టులో ఆడితే ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడిన రెండో అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందుతాడు. ప్రపంచకప్‌ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు ఈజిప్ట్‌ గోల్‌కీపర్‌ ఎసామ్‌ ఎల్‌ హదారీ (2018లో 45 ఏళ్లు) పేరిట ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement