breaking news
Goods prices
-
ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు, సేవలకు అసాధారణ రీతిలో గిరాకీ పెరుగుతోంది. అందుకుగల కారణాలు విశ్లేషించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈమేరకు జీఎస్టీ ఇ-వేబిల్లుల అనలటిక్స్‌ను ఉపయోగించి రియల్‌టైమ్‌లో ప్రభుత్వం ధరల ప్రభావాన్ని పరిశీలిస్తోందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. జీఎస్టీ విధానంలో వస్తువుల మొత్తం విలువ రూ.50,000 మించితే అంతరాష్ట్ర రవాణాకు ఇ-వేబిల్లును తీసుకోవడం తప్పనిసరి. రూ.5 కోట్లకు పైగా టర్నోవరు ఉన్న వ్యాపార సంస్థలు కూడా 2024 మార్చి 1 నుంచి ఇ-వేబిల్లులు తీసుకోవాల్సి ఉంది. వస్తు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. నిజంగా గిరాకీ ఏర్పడిందా.. లేదంటే కృత్రిమ కొరత సృష్టించేలా ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగులు కంపెనీ ఎందుకు మారడం లేదో తెలుసా..? వస్తువులకు గిరాకీ పెరగడాన్ని పర్యవేక్షించేందుకు రియల్- టైం జీఎస్టీ ఇ-వేబిల్లు అనలటిక్స్ మంచి సాధనమని నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలోని పత్రాలను విశ్లేషణ చేయడం ద్వారా మార్కెట్ల ధోరణి, పన్ను నిబంధనల పాటింపు వంటి వాటిని అధికారులు, వ్యాపారులు గుర్తించే అవకాశం ఉంది. దాంతో వెంటనే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని చెబుతున్నారు. -
జీఎస్టీతో ఒకే పన్ను విధానం
►‘సాక్షి’ డయల్ యువర్ సీటీఓకు అనూహ్య స్పందన ►రూ.20 లక్షల లోపు టర్నోవర్‌కు పన్ను ఉండదు ►జాయింట్ కమిషనర్ కృష్ణమోహనరెడ్డి నేటి నుంచి వస్తు సేవా పన్ను(జీఎస్టీ) అమలులోకి రానుంది. ఈ పన్ను అమలుతో కొన్ని వస్తువులు ధరలు పెరగనుండగా మరికొన్ని వస్తువులు రేట్లు తగ్గనున్నాయి. జీఎస్టీ పరిధిలోకి 10 వేల రకాలు వస్తువులు రానున్నాయి. అయితే ఏ కొద్ది మంది వ్యాపారులు ఒక చోట చేరినా జీఎస్టీ గురించి చర్చ నడుస్తోంది. ఏయే వస్తువులు ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయోనన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో డయల్ యువర్ సీటీఓ కార్యక్రమాన్ని స్థానిక వాణిజ్యపన్నులశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించారు. వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కృష్ణమోహనరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పలువురు వ్యాపారులు, వినియోగదారుల సందేహాలను నివృత్తి చేశారు.