breaking news
goodbye acting
-
అందుకే నటనకు గుడ్ బై – అనంత్‌నాగ్
‘‘ఇకపై నేను సినిమాల్లో నటించను.. మళ్లీ నటించాలనే ఆలోచన కూడా నాకు లేదు’’ అని కన్నడ సీనియర్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అనంత్‌నాగ్ తెలిపారు. బెంగళూరులోని యశవంతపురలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. నాసిరకం కథలు వస్తున్నాయి. ఇటీవల కథల్లో నాణ్యత లోపించింది. కథ, కథనం కంటే బాక్సాఫీస్ కలెక్షన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను ఒప్పుకుని నటించిన ఐదు సినిమాలు పరాజయం చెందాయి. ఆ క్షణం నుంచి ఇకపై సినిమాల్లో నటించరాదని నిర్ణయించుకున్నా. అంతేకానీ నటించకపోవటానికి ఆరోగ్య సమస్యలు ఏమాత్రం లేవు. ప్రస్తుత సమకాలీన దర్శకులతో పని చేయటం ఇష్టం లేదు. మంచి విషయం, ప్రేక్షకులను పట్టించుకోకుండా కేవలం వసూళ్ల కోసమే వెంపర్లాడుతున్న సంస్కృతి ఇండస్ట్రీలో ఉంది’’ అని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన అనంత్‌నాగ్ తాజా నిర్ణయం ఆయన అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఆయన మళ్లీ సినిమాల్లో నటించాలని పలువురు అభి్రపాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే... సినిమా రంగానికి అనంత్‌నాగ్ చేసిన విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. – ఆనంద రెడ్డి, సాక్షి, యశవంతపుర -
ఇక నటనకు గుడ్‌బై!
హాలీవుడ్ హాట్ లేడీ ఏంజెలినా జోలీ అభిమానులకు ఓ చేదు వార్త. ఇక, ఆమె నటనకు గుడ్‌బై చెప్పేయాలనుకుంటున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారామె. ఆరుగురు బిడ్డలకు తల్లయిన జోలీ, నలుగురు పిల్లల్నిదత్తత కూడా తీసుకున్నారు. ఈ పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలనుకుంటున్నానని, అందుకే ఇక నటించకూడదనుకుంటున్నానని రెండేళ్ల క్రితం ఆమె పేర్కొన్నారు. ఆ మేరకు ఓ రెండేళ్లు సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత మనసు మార్చుకుని ‘మేల్ఫిషెంట్’ అనే సినిమాలో నటించారు. వచ్చే నెల ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా చేస్తూ, పిల్లలను చూసుకోవడం పెద్ద కష్టమనిపించలేదట. అయినప్పటికీ నటనకు గుడ్‌బై చెప్పాలనుకోవడం ఎందుకంటే, ఇకనుంచి దర్శకురాలిగా మాత్రమే కొనసాగాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఆమె ‘అన్బ్రోకెన్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం విడుదల కానుంది. అన్నట్లు దర్శకురాలిగా జోలీకి ఇది మొదటి సినిమా కాదు. 2007లో ‘ఎ ప్లేస్ ఇన్ టైమ్’ అనే లఘు చిత్రం ద్వారా దర్శకురాలిగా మారి, ఆ తర్వాత నాలుగేళ్లకు ‘ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘అన్బ్రోకెన్’ చేశారు. ఈ సినిమా తర్వాత వరుసగా దర్శకత్వం వహించాలనుకుంటున్నారట. నటన అనేది ఓ వరం అని, ఆ వరాన్ని సద్వినియోగం చేసుకున్నానని, దర్శకురాలిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జోలీ తెలిపారు.


