breaking news
golden voice
-
Shruti Rane: మ్యూజిక్ వరల్డ్‌లో గోల్డెన్ వాయిస్..
'శృతి రాణే సింగర్, మ్యూజిక్ కంపోజర్. స్కూలు రోజుల నుంచి పాటలు పాడేది శృతి. స్థానికంగా జరిగే పాటల పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. ‘గోల్డెన్ వాయిస్’ అని శృతిని పిలిచేవారు. గానంలోనే కాదు పాటల కంపోజింగ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది శృతి.' తన డైనమిక్ స్టేజీ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తన అభిమాన మ్యూజిక్ కంపోజర్లు ప్రీతమ్, విశాల్–శేఖర్. ఎంత జటిలమైన పాటను అయినా అవలీలగా పాడే శృతి క్లాసిక్ సాంగ్స్ రీక్రియేటెడ్ వెర్షన్స్‌కు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా విమర్శలు తప్పవు. ‘బాలీవుడ్ క్లాసిక్సాంగ్స్ను ఇష్టపడే లక్షలాది శ్రోతలలో నేను ఒకరిని. ఒక క్లాసిక్ సాంగ్‌కు సంబంధించి బ్యాడ్ వెర్షన్ విన్నప్పుడు ఎంత కోపం వస్తుందో నాకు తెలుసు. ఒరిజినల్ ఎసెన్స్ మిస్ కాకుండా పాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదృష్టవశాత్తు రీక్రియేట్ వెర్షన్‌కు సంబంధించి నాకు ప్రశంసలు తప్ప విమర్శలు ఎదురు కాలేదు’ అంటుంది శృతి రాణే. -
సువర్ణ స్వరం మూగబోయింది
అలానాటి బాలీవుడ్ సింగర్ ముబారక్ బేగం మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. 50లలో గాయనిగా వెండితెరకు పరిచయం అయిన ఆమె దాదాపు మూడు దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీతానికి సేవలందించారు. ఆల్ ఇండియా రేడియో గాయనిగా, భక్తి గీతాల గాయనిగా, సినీ నేపథ్యగాయనిగా ఎన్నో రంగాలల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. లతా మంగేష్కర్ లాంటి ఉద్దండుల సమకాలీనురాలిగా పేరుతెచ్చుకున్న ముబారక్ బేగం.. దేవదాస్, మధుమతి, హమారీ యాద్ ఆయేగీ లాంటి బాలీవుడ్ క్లాసిక్స్‌కు తన స్వరంతో మరింత అందాన్ని తీసుకువచ్చారు. 1980లో సినిమా పాటలకు దూరమైన ముబారక్ బేగం, తరువాత తన కుమారుడితో కలిసి ముంబైలో సెటిల్ అయ్యారు. 2015లో తన కూతురి మరణంతో కుంగిపోయిన ముబారక్ బేగం ఆరోగ్యం దెబ్బతింది. అప్పటి నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆమె చివరి రోజుల్లో హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లెజెండరీ సింగర్‌గా లతా మంగేష్కర్, ఆశాబోంస్లే లాంటి వారికి పోటి ఇచ్చిన ఆమె, చివరి రోజుల్లో మాత్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించబడిన ముబారక్ బేగం మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖుల సంతాపం తెలియజేశారు.