breaking news
Gobi Desert
-
'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్ చేసిందట!
గోబీ మంచూరియాని ఇష్టపడిని వాళ్లు ఉండరు. దాన్ని చూస్తేనే నోటిలో నీళ్లు ఊరిపోతాయి. అలాంటి గోబీ మంచూరియాని భారత్‌లోని ఆ నగరం పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాదండోయ్ అక్కడ స్టాల్స్‌లో దీన్ని ఎక్కడైన అమ్మితే అధికారులు వాటిపై దాడులు కూడా నిర్వహిస్తారట. ఎందుకని ఇంతలా గోబీ మంచూరియాపై యుద్ధం చేస్తున్నారో వింటే కచ్చితంగా మనం కూడా బుద్ది తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామేమో!. ఏంటీ ఇలా అంటున్నారేంటీ అనుకోకండి. వింత రుచుల మాయలో అందులో ఏం వాడుతున్నారు? ఎలాంటివి తినేస్తున్నాం అనేవి మర్చిపోతున్నాం. జిహ్వ చాపల్యంతో కోరి కష్టాలు తెచ్చుకునే నేటి జనరేషన్‌కు ఇదొక కనువిప్పు అనే చెప్పాలి. ఎందుకిలా చెబుతున్నానంటే.. గోబీ మంచూరియా రుచే వేరబ్బా!. తింటే వదలరు అనేంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో ఇష్టమైన వంటకం ఇది. అయితే దీన్ని కార్న్‌ప్లోర్ పిండిలో ముచి వేయించి ఆ తర్వాత సోయా సాస్, వెనిగర్, పంచదార, టొమోటా సాస్‌తో కాస్త గ్రేవీ లేదా డ్రైగా చేసి ఇస్తారు. ఇలా స్పెషల్‌గా చేసే వంటకం కావడంతోనే నిషేధం విధించింది భారత్‌లోని గోవా నగరం. అందులో వినియోగించే పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే దాని రుచికి ఫిదా అయ్యి ప్రజలు అవేమీ పట్టించుకోకుండా లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. దీంతో గోవా మపుసా మున్సిపల్ కౌన్సిల్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెసిపీ విక్రయాలను పూర్తిగా నిషేధించింది. ఎక్కడైన ఫుడ్ స్టాల్స్‌లో ఈ డిష్ ఉంటే వెంటనే వాటిపై దాడులు నిర్వహించడం వంటివి చేసేలా అధికారులుకు ఆదేశాలను జారీ చేసింది కూడా. కేవలం మున్సిపల్ పౌర సంస్థే కాదు. గోవాలోని శ్రీ దామోదర్ ఆలయంలో వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) గోబీ మంచూరియా అమ్మే స్టాళ్లను తీసేయాలని మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాదు ఆ డిష్ అమ్మకాలు అరికట్టేలా ఎప్డీఏ స్టాల్స్‌పై పలు దాడులు కూడా నిర్వహించింది. దీంతో ఆ వంటకం గోవా వీధుల్లోని స్టాల్స్‌లో ఎక్కడ కనిపించదనే చెప్పొచ్చు. నిజానికి ఈ గోబీరియా మంచూరియా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. ముంబైకి చెందిన చైనీస్ పాక శాస్త్ర నిపుణుడు నెల్సన్ వాంగ్ ఈ వంటకాన్ని కనిపెట్టాడు. 1970లలో క్రిక్ట్ క్లబ్ ఆప్ ఇండియాలో క్యాటరింగ్ చేస్తున్నప్పుడూ చికెన్ మంచూరియాను తయారు చేశాడు. అతను చికెన్ నగ్గెట్‌లను స్పైసీ కార్న్‌ఫ్లోర్ పిండిలో వేయించి పొడిగా లేదా సోయా సాస్, వెనిగర్, పంచదార లేదా టోమాట సాస్‌లో గ్రేవీ రూపంలో సర్వ్ చేసేవాడు. ఇక శాకాహార ప్రియులకు ఆ లోటును భర్తీ చేసేలా దాని స్థానంలో గోబీ మంచూరియాని తీసుకొచ్చాడు. అలాంటి గోబీ మంచూరియాని ప్రజల ఆరోగ్యం కోసం గోవా నగరం నిషేధించడం విశేషం. ఇలా ప్రతీ నగరంలోని అధికారులు భావిస్తే ప్రజలు అనారోగ్యం బారినపడటం తగ్గుముఖం పడుతుంది కదూ!. (చదవండి: బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి?) -
‘గండరగండ’భేరుండం
ఎలాంటి భారీ జంతువునైనా ఒక్క ఉదుటున తన్నుకుపోయే గండభేరుండ పక్షి గురించి జానపద కథల్లో చాలామంది చదువుకునే ఉంటారు. అప్పట్లో అలాంటి భారీ పక్షులు ఉంటే ఉండొచ్చని నమ్మేవారు కొందరైతే, అలాంటివన్నీ అభూత కల్పనలని కొట్టిపారేస్తారు మరికొందరు. గండభేరుండ పక్షి అభూత కల్పనేమీ కాదు, సుదూర భూతకాలంలో అలాంటి పక్షిజాతి ఒకటి నిజంగానే జీవించి ఉండేదనేందుకు ఇటీవలే ఆధారాలు బయటపడ్డాయి. మంగోలియాలోని గోబీ ఎడారి ప్రాంతంలో దీని అవశేషాలు బయటపడ్డాయి. వాటిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ పక్షి దాదాపు ఒక విమానం సైజులో ఉండేదని చెబుతున్నారు. దీని రెక్కల పొడవు ఏకంగా 36 అడుగుల వరకు ఉండేది. ఇది నేలపై నిలుచుంటే దీని ఎత్తు జిరాఫీని మించి ఉండేదని, అప్పట్లో ఇది డైనోసార్ పిల్లలు సహా భారీ జంతువులను వేటాడి బతికి ఉండవచ్చని అంటున్నారు. గోబీ ఎడారిలో దొరికిన దీని వెన్నుపూస ముక్కల శిలాజాలు ఒక్కొక్కటి ఎనిమిది అంగుళాల పొడవు ఉన్నట్లు చెబుతున్నారు. జపాన్‌లోని టోక్యో వర్సిటీ శాస్త్రవేత్తలు, బ్రిటన్‌లోని పోర్ట్స్మౌత్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పక్షి శిలాజాలపై పరిశోధనలు జరుపుతున్నారు. -
'రూ.వెయ్యి కోట్లు సేఫ్... నేనెక్కడికి పారిపోలేదు'
షాంఘై: తాను పారిపోయినట్టు వచ్చిన వార్తలను చైనా ఈ-ఫైనాన్సింగ్ కంపెనీ వాంగ్జూ గ్రూపు చైర్మన్ తోసిపుచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని, పది రోజుల పాటు ఫోన్ లో అందుబాటులో లేకపోవడంతో తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని వివరణయిచ్చారు. ఈ-ఫైనాన్సింగ్ కంపెనీ వాంగ్జూ ఫార్టూన్ కంపెనీ చైర్మన్ యాంగ్ వీగుయ్ బిలియన్ యువాన్లతో పారిపోయినట్టు చైనా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇన్వెస్టర్ల నుంచి రూ.2 వేల కోట్లుపైగా సేకరించి వెయ్యి కోట్లతో ఆయన ఉడాయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో యాంగ్ వీగుయ్ స్పందించారు. తన వివరణతో కూడిన వీడియోను పంపించారు. తన సిబ్బంది లేఖ కూడా రాశారు. పది రోజుల పాటు ఫోన్లకు దొరక్కకుండా ప్రశాంతంగా ఉండి.. కంపెనీని పటిష్టపరిచే వ్యూహాలు ఆలోచించేందుకు గోబీ ఎడారికి వెళ్లిపోయానని తెలిపారు. తాను తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను పారిపోయానంటూ వచ్చిన వార్తలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల సొమ్ముతో పరారైనట్టు చిత్రీకరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్ల సొమ్ము ఎక్కడికి పోదని భరోసా యిచ్చారు. తన కోసం వెదుకుతున్న స్థానిక పోలీసులకు సహకరిస్తానని చెప్పారు.