Glamour industries
-
బిజినెస్ ఉమెన్ @ మెట్ మెరుపులు
ఒకప్పుడు మోడల్స్‌కు, సినీతారలకు మాత్రమే పరిమితమైన గ్లామర్ వేదికలపై ఇప్పుడు మహిళా వ్యాపారవేత్తలు కూడా మెరుస్తున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు ఫ్యాషన్ మెరుపుల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ రెడ్ కార్పెట్‌పై నిర్వహించిన మెట్‌గాలా ఫ్యాషన్ ఈవెంట్ మరోసారి గ్లామరస్ బిజినెస్ టైకూన్స్ మెరుపులకు పట్టం కట్టింది. ఒక్కొక్కరు ఒక్కోరకమైన విశేషాల వస్త్రధారణతో ర్యాంప్‌పై తళుక్కుమన్నారు.కోట్ల విలువైన వజ్రాభరణాలతో...ప్రముఖ వ్యాపార సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్– ఇన్ఫ్రాస్ట్రక్చర్స్’ సంస్థకు చెందిన వ్యాపారవేత్త సుధారెడ్డి, న్యూయార్క్ నగరంలో జరిగిన మెట్ గాలా ఈవెంట్లో సెన్సేషన్‌గా నిలిచారు. భారతీయ వస్త్ర సంప్రదాయాలను ముఖ్యంగా తెలంగాణ వస్త్రశైలుల విశిష్టతను చాటిచెబుతూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ సంవత్సరపు ‘కాస్ట్యూమ్ ఆర్ట్’ థీమ్‌కు అనుగుణం గా, ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ పేరుతో ఆమె వస్త్రధారణను బాలీవుడ్ టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ప్రఖ్యాత సెలబ్రిటీ స్టైలిస్ట్ మారియల్ హేన్ సంయుక్తంగా రూపొందించారు. దీనికితోడు దాదాపు 126 కోట్ల విలువైన ఆభరణాలు సైతం ధరించి ఆమె అందరి దృష్టిని మరింతగా ఆకర్షించారు. ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ అని పేర్కొనే 550 క్యారెట్ల భారీ ముదురు ఊదా–నీలం రంగు టాంజనైట్, విక్టోరియన్ శైలి వజ్రాల నెక్లెస్ వీటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదరహో ... అంబానీ...ఇదే మెట్ గాలాకు ప్రముఖ వ్యాపార కుటుంబం అంబానీ ఫ్యామిలీ నుంచి ఇషా అంబానీ హాజరయ్యారు. ఆమె స్వదేశ్ కళాకారుల సహకారంతో డిజైనర్ గౌరవ్ గు΄్తా రూపొందించిన కస్టమ్ కౌచర్ చీరను ధరించారు. స్వచ్ఛమైన బంగారు దారాలతో నేసిన ఈ చీరపై, లేత బంగారం మట్టి రంగులలో చేతితో చిత్రించిన పిచ్వాయి–ప్రేరిత మోటిఫ్‌లు ఉన్నాయి. ఈ డిజైన్, చీరను ఒక శిల్పంలాంటి డ్రేప్‌తో, ఒక కళాత్మక రూపంగా ఆవిష్కరించింది. భారతీయ కళాకారుల చేతుల మీదుగా బంగారంతో నేసిన ఈ చీర పైభాగానికి, వస్త్రంపై 200కు పైగా పాతకాలపు వజ్రాలను చేతితో కుట్టారు. ఇవన్నీ ఆమె తల్లి నీతా అంబానీ వ్యక్తిగత ఆభరణాల సేకరణ కావడం విశేషం.స్టైల్స్‌లో ‘రాణింపు...జైపూర్ రాజ కుటుంబం కూడా మెట్ గాలా లో తనదైన శైలి రాజసం ఒలికించింది. రాజ వంశపు వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువస్తూ, యువరాణి గౌరవి కుమారి తన అమ్మమ్మ నుంచి ప్రేరణ పొందిన దుస్తులతో మెట్‌గాలాలో అరంగేట్రం చేశారు. ప్రబల్ గురుంగ్ రూపొందించిన ఈ గౌనులో, మహారాణి గాయత్రీ దేవి అందించిన గులాబీ రంగు షిఫాన్ చీరను పొందుపరిచి, దానిని జైపూర్ నుంచి తెచ్చిన ముత్యాలు, కట్ చేయని వజ్రాలతో అలంకరించారు. ఈ లుక్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.అనన్య సామాన్యం...బిర్లాల కుటుంబానికి చెందిన భారతీయ మహిళా వ్యాపారవేత్త అనన్య బిర్లా కూడా తనదైన శైలిలో పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శించారు. డిజైనర్ రాబర్ట్ వన్ రూపొందించిన కస్టమైజ్డ్ దుస్తులను ధరించిన ఆమె, మెరిసే నల్లటి లోహంతో చేసిన స్కర్ట్‌పై బిగుతైన పెప్లమ్ జాకెట్‌ను ధరించారు. ప్రముఖ భారతీయ కళాకారుడు సుబోధ్ గు΄్తా రూపొందించిన వెండి ఫేస్ మాస్క్‌తో ఆమె సరికొత్త లుక్‌ను ప్రదర్శించారు. అతిరథ మహారథులైన హాలీవుడ్ నటీ నటులు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ పాల్గొనే మెట్‌గాలాలో మన భారతీయ మహిళా వ్యాపారులు సైతం తమ సత్తా ప్రదర్శించడం... మహిళల్లోని మల్టీ టాస్కింగ్ స్కిల్స్‌కు చిరు ఉదాహరణ మాత్రమే... మొత్తం మీద మెట్‌గాలా వేడుకలో బిజినెస్ ఉమెన్ మెరుపులు అందరినీ అబ్బుర పరచాయి. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
రావోయ్ సాంబా.. పోవే చిన్నా..
తీర్చిదిద్దిన శిల్పాల్లా ఉంటారు. గ్లామర్ ఇండస్ట్రీ కోసం పుట్టిన ‘అందమైన’ బేబీస్‌లా ఉంటారు. అంతేనా.. ఒకరి కోసం ఒకరన్నట్టు ఉంటారు. అక్క డిజైన్ల కోసం తమ్ముడు ర్యాంప్ ఎక్కితే, తమ్ముడి సినిమా కోసం అక్క డిజైనింగ్‌లో మునిగి తేలుతుంటారు. సిటీలోని ఫ్యాషన్, సినీ రంగాలకు చిరపరిచితమైన ఈ అక్కాతమ్ముళ్లు ఆప్యాయత అనురాగాలనే చెట్టు కొమ్మల్లా ఉంటారు. ‘సిబ్లింగ్స్’కు సిసలైన సింబల్ అనిపించే ఈ అందమైన తెలుగింటి ‘కొమ్మల్ని’ కదిలిస్తే కబుర్లెన్నో కురుస్తాయిలా.. ‘సాంబయ్యా.. ఈ పప్పుచారన్నం కొంచెం తిని వెళ్లరా’ ‘ఓయ్ చిన్నా... నన్నలా పిలవొద్దన్నానా?’ ‘‘పోవోయ్.. నేనలాగే పిలుస్తా’ ఈ సంభాషణ చదివితే.. అచ్చమైన తెలుగింటి కబుర్లులా కమ్మగా అనిపిస్తాయి. అదే అల్ట్రా మోడ్రన్ అక్కా తమ్ముళ్ల మధ్య అని తెలిస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ‘వీడు పుట్టినప్పుడు నాకొచ్చే గిఫ్ట్‌లూ, పేరెంట్స్ ముద్దులూ తగ్గిపోతాయేమోనని భయపడ్డా. నాకన్నా ఆరేళ్లు చిన్నోడు. అయినా నన్ను చిన్నా అని పిలుస్తాడు’ అంటూ మురిపెంగా చెప్పారు శిల్పారెడ్డి. ‘పెద్దరికం చూపించి తనే నావన్నీ లాక్కునేది. నేను ఫియరో బైక్ కొనుక్కుంటే తను వేసుకుని వెళ్లిపోయేది. మంచి పేరుంది కదా నాకు.. అయినా సాంబయ్యా, సమ్మూ అని పిలుస్తుంది’ అంటూ ఆ మురిపాన్ని షేర్ చేసుకున్నాడు సామ్రాట్. ఆడిపించినా.. ఏడిపించినా.. ‘నేను మంచం దిగకుండానే పొద్దున్నే చెస్ బోర్డ్ పట్టుకుని వచ్చేసేవాడు. ఆడి, ఓడిపోయేదాకా ఊరుకునేవాడు కాదు. ఫ్రెండ్స్‌తో నేను నా రూమ్‌లో ఉంటే బయట నుంచి ఒకటే గోల..’ తమ్ముడి చిన్ననాటి అల్లరి గురించి శిల్ప ఫిర్యాదులు కొనసాగుతూండగానే.. ‘ఫ్రెండ్స్‌తో ఉంటే డిస్ట్రబ్ చేస్తున్నానని రిబ్బన్లతో కట్టేసి 2 గంటలు అలాగే ఉంచేసేది’ అంటూ ఎదురుదాడికి దిగాడు సామ్రాట్. ఈ జ్ఞాపకాల జడిలో ఆటపట్టించు కున్నవైనా.. ప్రోత్సహించుకున్నవీ ఉన్నాయి. చప్పట్లూ.. ముచ్చట్లూ.. చదువులో కన్నా కళల్లోనే ప్రావీణ్యం చూపించిన వీరిలో ఫ్యాషన్ ఐకాన్‌గా శిల్ప, సినీనటుడిగా సామ్రాట్లు ఉండటం ఆశ్చర్యం కలిగించదు. ‘తమ్ముడు స్పోర్ట్స్ బాగా ఆడేవాడు. మిమిక్రీ చేసేవాడు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. మేడ మీద చిన్న స్టేజ్ లాంటిది వేసి నేను పాడుతూంటే వాడు వేల మంది ప్రేక్షకుల పెట్టు అయ్యేవాడు. వాడు మిమిక్రీ చేస్తూంటే చేయి కందిపోయేలా చప్పట్లు కొట్టేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు శిల్పారెడ్డి(గాయని కాబోయిన శిల్ప మోడల్‌గా మారారు. సామ్రాట్ మాత్రం నటుడిగా కొనసాగుతున్నాడు). ‘ సమ్మూకి మోడలింగ్ ఇంట్రస్ట్ లేక ఆఫర్లు వచ్చినా చేయలేదు. అయితే నా కోసం ర్యాంప్ వాక్ చేస్తాడు’ అని శిల్ప అంటుంటే అందుకుని ‘నా కోసం చిన్నా చాలాసార్లు డిజైన్ చేసింది. తను నా సినిమాకి పూర్తిస్థాయి డిజైనర్‌గా చే యాలని నా కోరిక’ ని చెప్పాడు సామ్రాట్. అక్క కోసం కొట్టాలనుకున్నా.. తమ్ముడ్ని కొడుతుంటే ఏడ్చా... ‘అక్కంటే నా ఫ్రెండ్స్‌లో కొందరు తెగ క్రేజీగా ఉండేవారు. నాకెందుకో వాళ్లు అలా ఉండటం నచ్చేది కాదు. కొట్టాలనిపించేది’ అని సామ్రాట్ గుర్తు చేసుకుంటాడు. అదే స్థాయిలో.. ‘ఫస్ట్ మూవీలో తమ్ముడిని కొట్టే సన్నివేశం చూస్తున్నప్పుడు ఏడుపు ఆగలేదు’ అంటూ సోదర ప్రేమను మనతో పంచుకుంటున్నప్పుడు ఎన్ని రంగుల ప్రపంచాలైనా రక్త సంబంధాల ముందు దిగదుడుపే అనిపించకమానదు. రాఖీ పండుగ వచ్చిందంటే ప్రతి ఇల్లూ సోదరీ సోదరుల ఆప్యాయతలతో నిండిపోతుంది. ‘ప్రతి రాఖీ పండుగకు నేను రాఖీ కడతాను. వీడు నాకు డబ్బులిస్తాడు. మావయ్యకి రాఖీ కట్టేందుకు అమ్మ వెళుతుంటే మేం కూడా మామయ్య ఇంటికి వెళ్లి సరదాగా గడిపేస్తుంటాం’ అంటూ ఆ పండుగ అనుభూతుల్ని అప్పజెబుతారు శిల్ప. ‘తనింత సంపాదించుకుంటుందా? కాని చిన్న రాఖీ కట్టేసి, పప్పుచారన్నం పెట్టేసి బోలెడన్ని డబ్బులు గుంజేస్తుంది’ అని చెప్పాడు సామ్రాట్. ఈ సరదాల మాటున కొండంత ఆదరణ ఉంది. ఈ గిల్లికజ్జాల నీడలో అంతులేని అనురాగం వర్ధిల్లుతూ ఉంది. ‘సినిమాల్లోకి వెళ్లినప్పుడు సంతోషించినా.. నటనను ఒక ఇష్టమైన వ్యాపకంగా మాత్రమే ఉంచుకో. ఇంకేదైనా కెరీర్‌ను ఆప్షనల్‌గా పెట్టుకో’ అని చెప్పారట శిల్ప. ‘పెద్దక్క అమ్మలాంటిదే అయితే, ‘చిన్నా’ (చిన్నక్క) నాకు ఫ్రెండ్, ఆమె చెప్పింది అక్షరాలా ఫాలో అవుతున్నా’ నన్నాడు సామ్రాట్. ‘మనిషి ఎదుగుదలను అందలాలను చూసి కాదు అనుబంధాలను చూసి చెప్పాలి’ అన్న మాట ఈ అక్కాతమ్ముళ్ల అనుబంధమంత నిజం. - ఎస్.సత్యబాబు


