breaking news
Glamorous heroines
-
మోడ్రన్ లుక్స్ తో అదరగోడుతున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
-
బ్యూటిఫుల్ దెయ్యాలు
గ్లామర్ పాయింట్ మతి చెదరగొట్టే అందంతో ముగ్ధ మురిపించినప్పుడు... ముద్దుగా అందాల రాక్షసి అని సంబోధిస్తుంటారు. కానీ ఆ అందాల భరిణె రక్తం తాగే రక్కసి అని తెలిస్తే ఎలా ఉంటుంది! గుండె అదిరిపోతుంది. ప్రాణం బెదిరిపోతుంది. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అలాగే అయ్యింది. హీరోయిన్ అంటే అందంతో మురిపించాలి. స్టెప్పులతో అలరించాలి. కానీ అందుకు భిన్నంగా చేసిన హీరోయిన్లు ఉన్నారు. కలువ రేకుల్లాంటి కన్నుల్లో క్రూరత్వాన్ని పలికించారు. అందమైన చిరునవ్వులతో అలరించేవాళ్లు కాస్తా వికటాట్టహాసాలతో హడలెత్తించారు. హీరోని ప్రాణంగా ప్రేమించే ప్రేయసిగా కనిపించాల్సింది పోయి పిశాచాలుగా నటించి ప్రాణాలు పిండేశారు. ఆ బ్యూటిఫుల్ దెయ్యాలే వీళ్లు. మంచిదైనా, చెడ్డదైనా... దెయ్యం దెయ్యమే. అదంటే అందరికీ భయమే. అందుకే ఈ గ్లామరస్ హీరోయిన్లు దెయ్యాల పాత్రలు వేస్తే ప్రేక్షకులు గుండె చిక్కబట్టుకుని చూశారు. ముచ్చెమటలు పట్టించిన వారి అద్భుత నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయారు!