‘గీతాంజలి’లోగో ఆవిష్కరించిన పవన్
                  
	హైదరాబాద్: అంజలి తొలిసారిగా నటిస్తోన్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘గీతాంజలి’ లోగోను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కోన వెంకట్, ఇతర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై  ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాజకిరణ్ దర్శకునిగా
	 పరిచయమవుతున్నారు.
	
	ఈ సినిమా గురించి  కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘ఎవ్వరూ ఊహించని విధంగా కథాకథనాలు  ఉంటాయి. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.  అనుష్కకు  అరుంధతిలా, అంజలికి గీతాంజలి ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అని  చెప్పారు. నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ఇప్పటికి  యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో మొత్తం 4 పాటలుంటాయి. జూన్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. 
	అంజలి, బ్రహ్మానందం, రావు రమేష్, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్ రాణే, సత్యం  రాజేష్, మధునందన్, షకలక శంకర్, హర్షవర్థన్, అపర్ణ వర్మ తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్ప్లే-మాటలు: కోన  వెంకట్, డాన్స్: శేఖర్, యాక్షన్: విజయ్, ఆర్ట్: రఘు కులకర్ణి, ఎడిటింగ్:
	 ఉపేంద్ర, కెమేరా: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్.కుమార్.