breaking news
Gita mittal
-
కశ్మీర్ హైకోర్టు మహిళా సీజేగా జస్టిస్ గీత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ శనివారం కశ్మీర్ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వోహ్రా జస్టిస్ మిట్టల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ప్రస్తుత, పదవీ విరమణ పొందిన హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు హాజరయ్యారు. 1981లో జస్టిస్ మిట్టల్ న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించారు. 2004 జూలై 16న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు గీత ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన జడ్జిగా ఉన్నారు. -
ఆటోలో కోర్టు విజిట్?!
► ఆటోలో ప్రయాణించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ► కోర్టు పరిసరాలను ఆకస్మిక తనిఖీ చేసిన వైనం న్యూఢిల్లీ: ఆరు ఆటో రిక్షాలు హఠాత్తుగా వచ్చి ఢిల్లీ హైకోర్టు ముందు ఆగాయి. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆటోలో ఉన్న వ్యక్తులు యధాలాపంగా బయటకు వచ్చి.. హైకోర్టు పరిసరాలను, న్యాయవాదులను పరిశీలించడం మొదలు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత కానీ ఆటోలో వచ్చింది ఎవరో అక్కడివారికి అర్థం కాలేదు. అర్థం అయ్యాక ఆటోల ముందు న్యాయవాదులు, అధికారులు పరుగులు పరుగులు తీశారు. ఆటోలో వచ్చింది.. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, ఇతర న్యాయమూర్తులు రవీంద్ర భట్, మురళీధర్, సంజీవ్ ఖన్నా తదితరులు ఢిల్లీ హైకోర్టును ఆకస్మింగా తనఖీ చేసేందుకు సామాన్యుల్లా ఆటోల్లో వచ్చారు. ఢిల్లీ హైకోర్టులోని అధికారులు, న్యాయమూర్తుల పనితీరు, క్రమశిక్షణను పరిశీలించేందుకే ఇలా వచ్చినట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా గీతా మిట్టల్ చెప్పారు. కోర్టు ప్రాంగణంలో మౌలిక వసతులను సైతం వారు పరిశీలించారు. పరిపాలనాపరంగా కొన్ని లోపాలను గుర్తించామని గీతా మిట్టల్ చెప్పారు. వాటిని దిద్దుకునేందుకు తగిన సూచనలు, సలహాలు చేశామని చెప్పారు.