breaking news
Girl beats molester
-
మదురై అసిస్టెంట్ జైలర్ వేధింపులు..
అన్నానగర్: అసిస్టెంట్ జైలర్ వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదురై అరసరడిలోని సెంట్రల్ జైలులో బాలగురుసామి అనే వ్యక్తి అసిస్టెంట్ జైలర్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్ల కిందట సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీని కలవడానికి అతని భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఆమెను పరిచయం చేసుకున్న అసిస్టెంట్ జైలర్ ఆమెతో పాటు వచ్చిన యువతిని లైంగికంగా వేధించాడు. ఆ మహిళ మదురై మహిళా పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.విచారణ నిమిత్తం తల్లి, కూతుళ్లు అసిస్టెంట్ జైలర్‌పై దాడికి పాల్పడిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై శాఖాపరమైన విచారణలు జరిపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ జైలర్ బాలగురుస్వామిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో బాలగురుసామిని సస్పెండ్ చేస్తూ మదురై జైళ్ల శాఖ డీఐజీ పళని ఆదేశాలు జారీ చేశారు. బాలగురుసామిని విచారించగా పలు రకాల సమాచారం బయటకు వచ్చింది. దీంతో అతడిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. అమ్మాయిలను టార్గెట్ చేసి సాన్నిహిత్యం ప్రదర్శించి పలువురు మహిళలను అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. அவரு ஆபீசரா இருக்கலாம்.. அதுக்காக மகளை கேட்பாரா..? மத்திய சிறை உதவி ஜெயிலர் பாலகுருசாமி மீது வழக்குப்பதிவு pic.twitter.com/YMRXLMv97a— Mahalingam Ponnusamy (@mahajournalist) December 22, 2024 -
ఆకతాయికి అమ్మాయి చెప్పుదెబ్బ
బరేలి: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. దుండగుల దాడిలో ఎందరో మహిళలు బలవుతున్నారు. కాగా కొంతమంది అమ్మాయిలు తమను వేధించినవారిని తగినబుద్ధి చెప్పి, ఇతరుల్లో ధైర్యం కలిగిస్తున్నారు. ఓ అమ్మాయి ఆకతాయిపై తిరగబడి తగినశాస్తి చేసింది. యూపీలోని బరేలి జిల్లాలో అసభ్యకర మాటలతో వేధించిన ఆకతాయిని అమ్మాయి చితకబాదింది. బాధితురాలు తనను వేధించిన ఆకతాయి గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు నిందితుడిని పట్టుకుని ఓ చోట కూర్చోబెట్టి ఆ అమ్మాయితో దేహశుద్ధి చేయించారు. బాధితురాలు చెప్పు తీసుకుని పలుమార్లు నిందితుడిని కొట్టింది. మొహంపై ఉమ్మేసి చివాట్లు పెట్టింది. అక్కడున్న యువకులు కొందరు నిందితుడిని కాళ్లతో తన్నారు. కాగా ఇది ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగింది అన్న విషయాలు తెలియరాలేదు. అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.