breaking news
GHMC authorities
-
విజేత సూపర్ మార్కెట్ సీజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్త చర్యలు తీసుకోని సూపర్ మార్కెట్లను జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చందానగర్‌కు చెందిన విజేత సూపర్ మార్కెట్‌ను శనివారం అధికారులు సీజ్ చేశారు. సూపర్ మార్కెట్లో భౌతిక దూరం పాటించకుండా ఒకేసారి ఎక్కుమందిని లోపలికి పంపడం, ఒకే దగ్గర అధిక సంఖ్యలో కస్టమర్స్ ఉండటంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వాల్‌మార్ట్ ‘బెస్ట్ ప్రైస్’ సూపర్ మార్కెట్లో అధికారులు తనిఖీలు చేశారు. సీజ్ చేసినట్టు వచ్చిన వార్తలను వాల్‌మార్ట్ ఇండియా తోసిపుచ్చింది. అధికారులు తనిఖీలు మాత్రమే చేశారని వెల్లడించింది. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే అధికారుల తీరుపై సూపర్ మార్కెట్ యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక లాక్డౌన్ సమయంలో ప్రజలకు అనువుగా నిత్యవసర సరుకులను అందిస్తున్న తమపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని, దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ గడువును తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కిరాణా వర్తకుడికి కరోనా పాజిటివ్ -
జీహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి
-
'జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి'
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాప్ వద్ద బుధవారం రాత్రి నాలాలో పడి గర్భిణి సత్యవాణి మృతి చెందడానికి జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే కారణమా? సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాప్ వద్ద నాలాను ఎందుకు మూసివేయలేదు? గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదు? ఈ ఘటనలో జీహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే తన భార్య సత్యవాణి మృతికి కారణమని ఆమె భర్త ప్రేమ్‌రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం అలియాబాద్‌కు వచ్చారు. భాస్కర్, లక్ష్మి దంపతుల కూతురు సత్యవాణికి ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి సత్యవాణి తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వెళ్లేందుకు ఉప్పల్ బస్టాండ్ వద్దకు వచ్చింది. అయితే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయింది. ఆ తర్వాత మృతదేహాన్ని బయటకుతీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు తన భార్య నాలాలో పడితే జీహెచ్ఎంసి రెస్క్యూ టీం ఎనిమిదిన్నర గంటల తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారని సత్యవాణి భర్త అవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భార్య మృతికి జీహెచ్ఎంసి అధికారులదే పూర్తి బాధ్యత అని అంటున్నారు. సత్యవాణి మృతి చెంది 15 గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు జిహెచ్ఎంసి, రెవిన్యూ అధికారులు స్పందించలేదన్నారు. జిహెచ్ఎంసి అధికారులపై స్థానిక గోపాలపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ప్రేమ్‌రాజ్ చెప్పారు. సత్యవాణి మృతికి కారణమైన ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాను సంవత్సరం క్రితం నిర్మించారు. నాలా నిర్మిస్తున్న సమయంలో అది కూలిపోవడంతో స్ధానికులు అప్పుడే జీహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు లంచాలకు అలవాటుపడి ప్రజల రక్షణను గాలికి వదిలేస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గాంధీ ఆస్పత్రి ఆవరణలో బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు స్పందించి ఓపెన్ నాలాలు మూసివేయడంతో పాటు గర్భిణి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన సత్యవాణి కుటుంబానికి జీహెచ్ఎంసి రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. **