breaking news
ghaziabad attack
-
‘ఏం రాహుల్.. విషం నింపుతున్నావ్’
లక్నో: ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడిన ఘటన యూపీని కుదిపేసింది. ఇది మత కోణానికి సంబంధించిన క్రూర ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మతానికి, మానవత్వానికి ఇది సిగ్గుచేటంటూ స్పందించారు. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రాహుల్‌కి స్ట్రాంగ్ బదులిచ్చారు. ‘‘రాముడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు. ఆ పాఠం నీకు తెలియదు. నువ్వు జీవితంలో ఎప్పుడూ నిజాలు మాట్లాడవ్. ఈ ఘటనలో పోలీసులు ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా.. నువ్వు అబద్ధపు ప్రచారంతో సొసైటీలో విషం నింపాలని చూస్తున్నావ్. అధికార దాహంతో మానవత్వాన్ని అవహేళన చేస్తున్నావ్. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించడం ఇకనైనా ఆపేయ్’’.. అంటూ ట్విట్టర్లో యోగి రాహుల్ ట్వీట్ ఫొటోకి ఘాటుగానే బదులిచ్చారు. प्रभु श्री राम की पहली सीख है-"सत्य बोलना" जो आपने कभी जीवन में किया नहीं। शर्म आनी चाहिए कि पुलिस द्वारा सच्चाई बताने के बाद भी आप समाज में जहर फैलाने में लगे हैं। सत्ता के लालच में मानवता को शर्मसार कर रहे हैं। उत्तर प्रदेश की जनता को अपमानित करना, उन्हें बदनाम करना छोड़ दें। pic.twitter.com/FOn0SJLVqP — Yogi Adityanath (@myogiadityanath) June 15, 2021 జూన్ 5న లోని ప్రాంతానికి చెందిన అబ్దుల్ సమద్ అనే వ్యక్తిని ఓ గ్రూప్ ఎత్తుకెళ్లి.. కత్తులతో బెదిరించడం, పాకిస్తాన్ స్పై అంటూ తిట్టడం, గడ్డం తీసేసిన ఘటన వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇది మతకోణంలోని ఘటన కాదని స్పష్టం చేశారు. ఆ దాడిలో హిందు, ముస్లిం ఇరువర్గాల వాళ్లు ఉన్నారని, తాయెత్తులు అమ్మే సమద్ తీరు బెడిసి కొట్టడంతోనే వాళ్లు ఆ దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. చదవండి: ఆమె ట్వీట్‌తో ఇరకాటంలో యోగి -
ఆ దాడి చేయించింది.. మహిళా కానిస్టేబుల్!
బీజేపీ సీనియర్ నాయకుడు బ్రిజ్‌పాల్ టియోటియాపై వంద రౌండ్ల కాల్పులు జరిగిన కేసులో.. కీలక నిందితురాలు ఓ మహిళా కానిస్టేబుల్ అని తేలింది. ఆమెను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘజియాబాద్‌లో రాత్రి 7.20 గంటల సమయంలో ఏకే 47 రైఫిళ్లతో దాదాపు వంద రౌండ్లను బ్రిజ్‌పాల్ వాహనంపై కాల్చిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స కోసం నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ దాడిలో మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలం నుంచి పోలీసులు దాడికి ఉపయోగించిన వాహనంతో పాటు కొన్ని ఆటోమేటిక్ వెపన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళా కానిస్టేబుల్ సునీత భర్త.. రాకేష్ హసన్పూరియా. అతడు ఓ గ్యాంగ్‌స్టర్. 2003లో పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. తన భర్త మృతికి బ్రిజ్పాలే కారణమని సునీత అప్పట్లో ఆరోపించింది. బ్రిజ్‌పాల్ గతంలో ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆ కక్షతోనే ఇప్పుడు ఆయన మీద దాడి చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. 2012లో బ్రిజ్‌పాల్ ఎన్నికల్లో పోటీచేసినపుడు రాకేష్ హసన్పురియా కుటుంబం ఆయనను వ్యతిరేకించింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.