breaking news
German team
-
జర్మనీకి భారత్ షాక్
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): పురుషుల ప్రొ హాకీ లీగ్‌లో భారత జట్టు రెగ్యులర్ సమయంలో తొలి విజయం అందుకుంది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 3–1తో సంచలన విజయం సాధించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (7వ నిమిషంలో), శిలానంద్ లాక్రా (13వ నిమిషంలో), నీలకంఠ శర్మ (35వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (413) ఆడిన హాకీ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 412 మ్యాచ్‌లతో దిలీప్ టిర్కీ పేరిట ఉన్న రికార్డును మన్‌ప్రీత్ బద్దలు కొట్టాడు. తొమ్మిది జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెగ్యులర్ సమయంలో ఒక విజయం (3 పాయింట్లు), ‘షూటౌట్’లో ఒక విజయం (2 పాయింట్లు) సాధించింది. ‘షూటౌట్’ లో రెండు పరాజయాలు (ఒక్కో పాయింట్), రెగ్యులర్ మ్యాచ్‌లో ఆరు ఓటములు చవిచూసి ఏడు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
భారత్‌కు తొలి పరాజయం
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున హీనా బానో 58వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది. జర్మనీ జట్టుకు లీనా ఫ్రెరిచ్స్ (5వ నిమిషంలో), అనిక షానాఫ్ (52వ నిమిషంలో), మార్టినా రీసెంగర్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే భారత్ ఒక్క దానిని మాత్రమే సది్వనియోగం చేసుకుంది. మరోవైపు జర్మనీ జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. ఇందులో జర్మనీ ఒక పెనాల్టీ కార్నర్‌ను, పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్స్‌గా మలిచింది. మరోటి ఫీల్డ్ గోల్‌గా వచ్చింది. చివరి పది నిమిషాల్లో భారత్ పట్టుకోల్పోయి రెండు గోల్స్ సమర్పించుకోవడం గమనార్హం. నాలుగు జట్లున్న గ్రూప్ ‘సి’లో జర్మనీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.భారత్, ఐర్లాండ్ మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ తలపడుతుంది. క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. తొలిసారి 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీలో ఆరు గ్రూప్‌లు చేశారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆరు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన రెండు ఉత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
'నిమిషంలోపే 4 టైర్లనూ మార్చేశారు'
కారు టైరును మార్చాలంటే ఎంత సమయం పడుతుంది? ఐదు నిమిషాలా? లేక పది నిమిషాలా? ఇక నాలుగు టైర్లను మార్చాల్సి వస్తే ఎంత సమయం తీసుకుంటారు? జర్మన్ టీమ్ మాత్రం చిటికెలో కాదు కాని నిమిషంలోపే నాలుగు టైర్లు మార్చి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. జర్మనీకి చెందిన నలుగురు మెకానిక్‌లు కలసి హ్యాండ్ టూల్స్‌తో 59.62 సెకన్లలో నాలుగు టైర్లనూ అమర్చారు. ప్రపంచంలో వేగంగా కారు టైర్లను మార్చిన రికార్డును సృష్టించారు. గతంలో ఉన్న (1:23:85) రికార్డును బద్దలు కొట్టారు. అంటే ఈ రికార్డు కంటే 24 సెకన్ల వేగంగా కారు టైర్లను మార్చారు. కారు విడిభాగాలను సప్లై చేసే ఓ సంస్ధ ఈ టీమ్‌ను స్పాన్సర్ చేసింది.


