breaking news
Geo Company
-
రిలయన్స్ సంస్థతో టీటీడీ ఎంవోయూ
సాక్షి, తిరుమల: రిలయన్స్ సంస్థతో టీటీడీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఆన్లైన్ వ్యవస్థ బలోపేతం చేసేందుకు జియో సంస్థతో ఒప్పందం చేసుకుంది. గత నెల రిలయన్స్ క్లౌడ్‌తో ట్రయన్ రన్ నిర్వహించామని టీటీడీ తెలిపింది. శాశ్వతంగా యాప్ తయారు చేసేందుకు జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీటీడీ పేర్కొంది. చదవండి: ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ -
మార్కెట్లోకి జియోని మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్: జియోని కంపనీ మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.17,999 అని, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లో 6,020 ఎంఏహెచ్ బ్యాటరీ(ఒక్కోటి 3,100 ఎంఏహెచ్ ఉన్న రెండు బ్యాటరీలు) ఉండడం విశేషమని పేర్కొంది. ఈ ఫోన్ రివర్స్ చార్జింగ్(ఇతర డివైస్‌లను చార్జింగ్ చేసే పవర్బ్యాంక్గా పనిచేయడం)ను సపోర్ట్ చేస్తుందని అయితే ఈ రివర్స్ చార్జింగ్ కేబుల్‌ను విడిగా కొనుగోలు చేయాలని తెలిపింది. 4జీని సపోర్ట్ చేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఓఎస్‌పై పనిచేస్తుంది. 64-బిట్ 1.5 గిగా హెట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ఎంటీ6735 ప్రాసెసర్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ఇతర గృహోపకరణాలకు రిమోట్ కంట్రోల్‌గా కూడా ఈ మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుందని తెలిపింది.